మహారాష్ట్రలో అధికారం దిశగా ఏ పార్టీ అడుగులు వేయడంలేదు.  మహా ప్రజలు ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ ఇవ్వకపోవడంతో ఎవరు కూడా అధికారం ఏర్పాటు చేసేందుకు ముందుకు రాకపోవడం విశేషం. శనివారంతో ప్రభుత్వం గడువు ముగుస్తుంది.  గడువు దాటితే ప్రభుత్వం రద్దు అవుతుంది.  ఈలోపుగానే ప్రభుత్వం ఏర్పాటు కావాలి.  కానీ, ఎవరూ ముందుకు రాకపోవడంతో ఏం జరుగుతుందో తెలియక తికమకపడుతున్నారు.  గడువులోపు ప్రభుత్వం ఏర్పాటు జరిగే సూచనలు కనిపించడం లేదు.

కాగా, ఈరోజు బీజేపీ నేతలు గవర్నర్ ను కలుస్తున్నారు.  గవర్నర్ ను కలిసే నేతల్లో ఫడ్నవిస్ లేకపోవడం విశేషం.  మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రకాంత్, కొంతమంది బీజేపీ మంత్రులు గవర్నర్ ను కలుస్తున్నారు.  అయితే, ఇది మర్యాదపూర్వకంగా మాత్రమే కలుసుస్తున్నారట.  ప్రభుత్వం ఏర్పాటు చేయాలి అంటే ఇంకా 40మంది సపోర్ట్ అవసరం ఉన్నది.  శివసేనకు ముఖ్యమంత్రి పీఠం అప్పగించేందుకు బీజేపీ సుముఖంగా లేదు.  


అలాగే శివసేన కూడా ముఖ్యమంత్రి పీఠాన్ని వదులుకోవడానికి సిద్ధంగా లేదు.  ఇప్పటికి శివసేన అదే పాట పాడుతున్నది.  శివసేనకు ముఖ్యమంత్రి పీఠం ఇస్తామని లిఖితపూర్వకంగా హామీ ఇస్తేనే సపోర్ట్ చేస్తామని శివసేన అంటోంది.  అయితే, ఫడ్నవిస్ స్థానంలో మహాముఖ్యమంత్రిగా నితిన్ గడ్కారీ పదవి చేపడతారని వార్తలు వస్తున్నాయి.  ఈ వార్తలను ఫడ్నవిస్ కొట్టిపారేస్తున్నారు.  ఫడ్నవీస్ ఆధ్వర్యంలోనే ప్రభుత్వం ఏర్పాటు జరుగుతుందని అంటున్నారు.  


మహా రాజకీయంలో ఇంకా ప్రతిష్టంభన నెలకొని ఉండటంతో ఏం జరుగుతుందో తెలియక ప్రజలు అయోమయంలో పడిపోయారు.  ఎవరైనా ఒకరికే అధికారాన్ని కట్టబెడితే.. ఇలాంటి ఇబ్బందులు ఉండవు కదా. అటు ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు శివసేనకు సపోర్ట్ చేసేందుకు సిద్ధంగా లేవు.  ఎన్సీపీ సుముఖంగా ఉన్నా, కాంగ్రెస్ ససేమిరా అంటోంది.  ఒకవేళ శివసేనకు సపోర్ట్ చేస్తే హిందూ ఓటర్ల నుంచే కాకుండా, ముస్లిం మైనారిటీ ఓటర్ల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి వ్యతేరేకత వస్తుంది.  అది బీజేపీకి ప్లస్ అవుతుంది.  అందుకే ప్రతిపక్షంలోనే కూర్చోవాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: