సమాజంలో మంచిని పెంపొందించడం కోసం కొన్ని సంస్దలు నడుము బిగించి మంచిని ప్రచారం చేస్తున్నాయి. కాని మనుషులు చెవిటివారిలా ప్రవర్తిస్తూ వారి మాటలు వినే స్దితిలో లేరు. ఎందుకంటే ఒక మనిషిని నిర్దేశించేది అతని ఆలోచనలే అవి సరైన దిశగా సాగనప్పుడు అతని జీవితం కూడా ముళ్ళకంచెలా మారుతుంది. ఆ క్షణంలో పుట్టే ఆలోచనలు  కౄరంగా మారి తాను చేస్తున్న పని తప్పో ఒప్పో తెలియని పరిస్దితులను కల్పిస్తాయి.


ఇక మొన్న తెలంగాణలో సంచలనం సృష్టించిన రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ తహశీల్దార్‌ హత్య కేసులో నిందితుడిగా ఉన్న కూర సురేశ్‌ ముదిరాజ్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. అతడు అంత దారుణంగా ప్రవర్తించడానికి కారణం చిన్నదైన, పెద్దదైన క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం వల్ల రెండు ప్రాణాలు బలైయ్యాయి. కన్న వారికి కడుపుకోత మిగల్చగా, పసిపిల్లలను తల్లిలేని అనాధలుగా మార్చాయి.


కుండకు చిన్న చిల్లుపడినా దానిలో ఉన్న నీరు క్రమక్రమంగా ఖాళీ అవుతాయి. అలాగే మనిషిజీవితంలో కూడ ఆలోచన అనే కుండకు ఆవేశం అనే చిల్లు పడ్డప్పుడు దానిలో ఉన్న మంచి జారిపోయి మనిషిని రాక్షసునిగా మారమని ప్రేరేపిస్తుంది. ఇప్పుడు తహశీల్దార్ హత్య విషయంలో ఇదే జరిగింది. ఒక ఆలోచన వెనుక అంతులేని వ్యధ ఉంటుందని తెలిసిందే. వారిమధ్య జరిగింది వారికే తెలుసు. ఎవరు ఎవరిని ఇబ్బంది పెట్టారో తెలియదు కాని కాలం మాత్రం రెండు జీవితాలకు పెద్ద శిక్షనే వేసింది.


వారిని కన్నవారికి తీరని వేదనను మిగిల్చింది. జీవితంలో తిరిగి పొందలేని ప్రాణాలను అనాలోచిత నిర్ణయాలతో తీసుకునేలా ప్రేరేపించింది. దీని వల్ల వీరు సాధించిదేముందటే సమాధానం మాత్రం దొరకదు. ఇక ఈ సంఘటనతో తెలిసేదేమంటే ఒక నిర్ణయం మనిషి జీవితాన్ని ఏ స్దాయిలో ఉండాలో నిర్దేశిస్తుందని అర్ధం అవుతుంది.


అంతే కాదు జీవితంలో తీసుకునే నిర్ణయాలను ఆచితూచి ఎంపిక చేసుకొమ్మని ఈ సంఘటన నేర్పిస్తుంది. ఇక మరణం మనిషికి ఎప్పుడైన తప్పదు అలాగని ఆవేశంలో ఇలా తీసుకునే నిర్ణయాలను సమాజం కూడ హర్షించదు. ప్రాణం పోతే తిరిగిరాదని తెలుసుకోండి. విలువలేని విషయాలకోసం విలువైన ప్రాణాలు తీయడానికి బరితెగించకండి...


మరింత సమాచారం తెలుసుకోండి: