టీడీపీలో నాయకులకు కొదవ లేదు.. అని పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అంటూంటారు. పార్టీ నుంచి ఎవరైనా వెళ్లిపోయినా.. పార్టీపై ఎవరన్నా కామెంట్ చేసినా.. ఎటువంటి ఎన్నికల్లోనైనా పార్టీ ఓటమి చెందినా.. దాదాపుగా చంద్రబాబు నాయుడు నుంచి ఇదే డైలాగ్ రిపీట్ అవుతూంటుంది. తెలంగాణలో పార్టీ నుంచి ఎందరు వెళ్లిపోయినా ఇబ్బంది లేదని పార్టీకి కార్యకర్తల అండ.. ప్రజల అండ ఉందని చెప్తూంటారు. కానీ మొన్నటి హుజూర్ నగర్ ఉపఎన్నికలో పార్టీకి వచ్చిన ఓట్లు చూస్తే ప్రజల మాట దేవుడెరుగు.. కార్యకర్తలెంత మంది ఉన్నారా అని ఆలోచన రాక మానదు.

 


విషయానికి వస్తే.. ఏపీ టీడీపీలో ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్న పార్టీ స్పోక్స్ పర్సన్ సాధినేని యామిని పార్టీని వీడేందుకు సిద్ధంగా ఉన్నారని సమాచారం. ఎన్నికల తర్వాత నుంచి టీడీపీ కార్యక్రమాలకు, పార్టీకి అంటీముట్టనట్టుగా ఉన్న యామిని పార్టీని వీడుతారని వార్తలు వస్తున్నాయి. అవి నిజమేనని విశ్వసనీయవర్గాల నుంచి వస్తున్న సమాచారం. ఈ వార్తలు అవాస్తవమని కొట్టి పారేయటానికి వీల్లేకుండా ఉన్నాయి. ఇప్పటికే టీడీపీ ప్రభుత్వంపై అనేక విమర్శలు కార్యక్రమాలు చేపడుతోంది. ఏ కార్యక్రమంలో కూడా యామిని కనపడకపోవడం ఈ వార్తలకు ఊతమిస్తోంది. టీడీపీకి రాజీనామా చేసాక భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తారని ఊహాగానాలు వస్తున్నాయి.

 

 

టీడీపీ హయాంలో ఆమె ఇతర రాజకీయ పార్టీలపై విమర్శలు చేసేవారు. జనసేన నాయకులతో టీవీ డిబేట్ లతో జరిగిన సంభాషణ సంచలనమయింది. ప్రత్యేక హోదా కోసం టీడీపీ చేసిన పోరాటాల్లో ఆమె తెలుగ తల్లి వేషధారణలో ఆకట్టుకున్నారు. టీడీపీ తరపున బలమైన వాయిస్ వినిపించేవారు. టీడీపీని వీడి వేరే పార్టీలో చేరుతారా.. లేక రాజకీయాలకు దూరంగా ఉంటారా అనేది ఆమె నుంచి ఈ వార్తలకు స్పష్టమైన సమాధానం వచ్చాకే తెలుస్తుంది.

 


మరింత సమాచారం తెలుసుకోండి: