ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గత కొంతకాలంగా ఇసుక సమస్య పట్టిపీడిస్తోన్న  విషయం తెలిసిందే. రాష్ట్రంలో ఇసుక కొరత ఏర్పడడంతో రాష్ట్ర ప్రజలందరూ అల్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో ఉపాధి కరవై నిర్మాణరంగ కార్మికులు అందరూ రోడ్డున పడుతున్నారు. కనీసం తినడానికి తిండి లేక కుటుంబాన్ని పోషించలేక మనస్థాపానికి గురై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు భవన నిర్మాణ రంగ కార్మికులు. అయితే రాష్ట్రంలో ఏర్పడిన ఇసుక కొరతతో  ప్రతిపక్షాలు కూడా అధికార వైసిపి పార్టీ పై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. వైసీపీ అధికారంలోకి వచ్చాక నూతన ఇసుక విధానం ప్రవేశపెట్టడం వల్ల రాష్ట్రంలో ఇసుక కొరత ఏర్పడిందని... అంతేకాకుండా వైసీపీ నేతలు అక్రమ ఇసుక రవాణా కు పాల్పడడం వల్లే రాష్ట్రంలో ఇసుక కరువైందని విమర్శలకు  దిగుతున్నారు. ఇసుక కొరత నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీలన్నీ నిరసన కార్యక్రమాలు కూడా చేపడుతున్నాయి. 



 ఇసుక కొరత  సమస్యను  తీర్చి  భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి కల్పించాలని ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి.అయితే అధికార పార్టీ మాత్రం  గతంలో టిడిపి ప్రభుత్వ హయాంలో అక్రమ ఇసుక చాలా ఎక్కువగా జరగడం వల్లే రాష్ట్రంలో ఇసుక కొరత ఏర్పడిందని... రాష్ట్రంలో ఉన్న ఇసుకను అక్రమంగా రవాణా చేసి మళ్లీ ఇప్పుడు చంద్రబాబు అనవసర విమర్శలకు దిగుతున్నారు అని విమర్శిస్తున్నారు . ఇక తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పడిన ఇసుక కొరత సమస్యపై నగరి ఎమ్మెల్యే ఏపీఐఐసీ చైర్మన్ రోజా స్పందించారు. రాష్ట్రంలో  ఏర్పడిన ఇసుక కొరత సమస్యపై రోజా కీలక వ్యాఖ్యలు చేశారు. 



 వైయస్ జగన్ మోహన్ రెడ్డి చల్లని పాదం మోపడంతోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా కురుస్తున్నాయని... అందువల్లే రాష్ట్రంలో కొద్దిమేర ఇసుక సమస్య ఏర్పడిందని రోజా వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో  ఏర్పడిన ఇసుక  సమస్యను  చంద్రబాబు పవన్ కళ్యాణ్ రాజకీయ లబ్ధి కోసం వాడుకుని  ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు రోజ. విపక్ష నేతలు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని అన్నారు. గత ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబుకు మతిభ్రమించిందని  చిన్న మెదడు చితికి పోయిందని  రోజా ఎద్దేవా చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పాలన చూసి పొరుగు రాష్ట్రాల వారు సైతం జగన్ లాంటి ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటుంటే...  చంద్రబాబు మాత్రం అనవసర విమర్శలు చేస్తున్నారని విమర్శించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: