ఆర్టీసీ సమ్మె పై హైకోర్టులో కొనసాగుతున్న విచారణ మరోసారి వాయిదా పడింది. హైకోర్టు ఆర్టీసీ సమ్మె పై  విచారణను ఈ నెల 11 కు వాయిదా వేసింది. అయితే నేడు హైకోర్టులో జరిగిన విచారణకు ఆర్టీసీ కార్మికుల తరఫున ప్రతినిధులు.... ప్రభుత్వం తరఫున ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కె జోషిఆర్టిసి ఇంచార్జీ, కేంద్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణ రావు. జిహెచ్ఎంసి కమిషనర్ లోకేష్ కుమార్  విచారణకు హాజరయ్యారు. ఆర్టీసీ ఆర్థిక స్థితిగతులపై ఆర్టిసి ఇన్చార్జ్ ఎండీ  దాఖలు చేసిన అఫిడవిట్ పై  తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు... ఆర్టీసీ యాజమాన్యం సమర్పించిన అఫిడవిట్లో అనుమానాలు ఉన్నాయని తెలుపింది.  ఇక తాజాగా మరోసారి ప్రభుత్వం కోర్టుకు సమర్పించిన నివేదికపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. హైకోర్టుకు ప్రభుత్వం సమర్పించిన  నివేదికలు తప్పులతడక ఉన్నాయంటూ కోర్టు వ్యాఖ్యానించింది. ఐఏఎస్  స్థాయి అధికారులు ఇంత దారుణంగా నివేదికలు ఇవ్వడం తన సర్వీసులోనే  మొదటిసారి చుస్తున్నానంటూ ... అసహనం వ్యక్తం చేస్తారు హైకోర్టు చీప్ జస్టిస్ . 



 ఆర్టీసీ సమ్మె ను హైకోర్టు పరిష్కరించాలని  చూస్తుంటే ప్రభుత్వం ఆర్టీసీ యాజమాన్యం మాత్రం చిత్తశుద్ధి తొ వ్యవహరించటం లేదని ఆగ్రహం  వ్యక్తం చేశారు. ఆర్టీసీ సమ్మెపై  ప్రభుత్వం పునరాలోచన చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు సూచన చేసింది . అంతకు ముందుగా మోటార్ వెహికల్ టాక్స్ కింద  453 కోట్లు   ఆర్టీసీనే  ప్రభుత్వానికి బకాయి పడిందని  ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసిన నేపథ్యంలో... నివేదిక సమర్పించిన అధికారులు దానిపై వివరణ ఇవ్వాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని హైకోర్టు ఆదేశించింది. ఇక ఆర్థిక శాఖ సమర్పించిన నివేదికను పరిశీలించిన హైకోర్టు దానిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. హైకోర్టుకు సమర్పించిన  నివేదికలు  రెండు  పూర్తిగా విరుద్ధంగా ఉన్నాయని పేర్కొన్న హైకోర్టు... ఉద్దేశపూర్వకంగా తప్పుడు నివేదిక ఇస్తే కోర్టు ఆదేశాలను ధిక్కరించినట్టే  అని పేర్కొంది. అటు కేంద్రం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ రాజేశ్వరావు  ఏపీఎస్ఆర్టీసీ విభజన పూర్తి కాలేదని ఆయన వాదన వినిపించారు. తెలంగాణ ఆర్టీసీ కి ఎలాంటి చట్టబద్ధత లేదని అలాంటప్పుడు.... కేంద్రానికి తమ ఆర్టీసీలో 33 శాతం వాటా ఉండడానికి  అవకాశం లేదని తెలిపారు. కానీ   ఆంధ్రప్రదేశ్ ఆర్టిసిలో మాత్రం కేంద్రానికి  33 శాతం వాటా ఉందని ఆయన స్పష్టం చేశారు.



 అనంతరం విచారణ 11 వ తారీకు వరకు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది హైకోర్టు . ఇదిలా ఉండగా రాష్ట్రంలో రోజురోజుకు ఆర్టీసీ కార్మికులు మరణాలు పెరిగిపోతున్నాయి . ఆర్టీసీ సమ్మె మొదలైతే 34 రోజులు చేరుకున్న నేపథ్యంలో ఆర్టీసీ సమ్మె ముగింపు ఏంటనే దానిపై ప్రస్తుతం అందరిలో  ప్రశ్న తలెత్తుతోంది. సమ్మె మొదలైనప్పటి   నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు పరిష్కారం విషయంలో సానుకూలంగా స్పందించకపోగా...  ఆర్టీసీ కార్మికులకు హెచ్చరికలు జారీ  చేస్తున్నారు. దీంతో  ఆర్టీసీ కార్మికులు అందరూ తమ  భవిష్యత్తు ఏంటో అని ఆందోళన చెంది ఆత్మహత్యలు చేసుకోవడం గుండెపోటుతో మరణించడం జరుగుతుంది... ఇక తాజాగా జోగిపేట్ చెందిన నాగేశ్వర్ అనే  ఆర్టీసీ కండక్టర్ తమ భవిష్యత్తు  ఏమవుతుందో అని టెన్షన్ తో  ఏకంగా పిచ్చివాడు అయిపోయాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: