అతి అనేది అన్ని అనర్ధాలకి మూలం. ఈ అతిని ఎంత‌వ‌ర‌కూ కొన‌సాగించాలి అన్నది కూడా అతి ముఖ్య‌మైన విష‌యం. ఈ అతి అనేది ఒక్కొక్కసారి అనుకోని సమస్యలు తెచ్చిపెడుతుంది. దీనివల్ల గొడవలు జరగవచ్చూ, చివరికి ప్రాణాలు కూడా పోయిన సందర్భాలున్నాయి. అందుకే అతిగా ఆవేశపడకూడదు అంటారు. ఒకవేళ అతి అనేది మన మనస్సుని నియంత్రించ లేనప్పుడు మౌనంగా ఒంటరిగా ఉండటం మేలని మానసిన నిపుణులు చెబుతున్నారు.


ఇకపోతే శృంగారంలో అతి ప్రవర్తనవల్ల ఒక్కోసారి ప్రాణానికి అపాయం కూడా జరగవచ్చూ. ఇకపోతే ఇలా అతి ఆవేశంగా శృంగారం చేసుకున్న ఓ జంటలో ఆ మహిళ మరణం అంచుల వరకు వెళ్లింది. వివరాల్లోకి వెళ్లితే యూకేలోని వోర్సెస్టర్‌షైర్‌లోని మల్వేర్న్ ప్రాంతంలో నిర్వహిస్తున్న ‘అరోరా ఫెస్టివల్’ లో అపశృతి చోటుచేసుకుంది. అదేమంటే శృంగారంలో తీవ్ర ఉద్వేగానికి గురైన ఓ మహిళ ఆసుపత్రిపాలైంది. ఆమె తన పార్టనర్‌ కలిసి ఫెస్టివల్‌ ప్రాంగణంలో బహిరంగంగా ఏర్పాటు చేసిన పడకపై శృంగారం చేస్తుండగా గుండె నొప్పితో కుప్పకూలింది. దీంతో ఎయిర్ అంబులెన్సులో ఆవిడను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.


ఇక ఈ బాధిత మహిళ వయస్సు 52 సంవత్సరాలట. ఇకపోతే ‘స్వింగ్‌ఫీల్డ్స్’ అనే సంస్థ  ఐరోపాలోనే అత్యంత పెద్ద ‘సెక్స్ ఫెస్టివల్’ వేడుకను నిర్వహిస్తోంది. ఈ వేడుకలో 700 మంది పైగా సందర్శకులు తమ పార్టనర్లతో కలిసి పాల్గొన్నట్లు తెలిసింది. నగరానికి దూరంగా ఓ గ్రామంలోని పొలాల మధ్యలో నిర్వహించిన వేడుకకు భారీగానే డిమాండ్ ఉంది. ఇక ఈ వేడుకలో పాల్గొనేవారు రకరకాలుగా ఎంజాయ్ చేయొచ్చునట.


ఇందుకు గాను ఈ సంస్ద నిర్వాహకులు వినూత్న ఏర్పాట్లు చేశారు. డబుల్ డెక్కర్ పార్టీ బస్సు, బెల్ టెంటులు, షవర్‌లు, మెత్తని పరుపులు, తెరలు ఏర్పాటుచేసిన పందిరి మంచాలు ఇంకా ఎన్నో సదుపాయాలను కల్పించారు. వీటితోపాటు డీజే, కామెడీ షో, లైవ్ మ్యూజిక్ వంటి కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేస్తారట.. ఇలాంటి సెక్స్ ఫెస్టివల్లో పాల్గొని ఈ మహిళ తన ప్రాణాలకే ప్రమాదం తెచ్చుకుంది. అందుకే చేసేపని ఏదైన ఆలోచించి చేయాలంటారు పెద్దలు. 

మరింత సమాచారం తెలుసుకోండి: