ఇటీవలే ఒక  కార్యక్రమంలో మన హోంమంత్రి అమిత్ షా గారు మాట్లాడుతూ మన చరిత్రను విదేశీయులు తిరగ రాసారని అదే మనకు అందుబాటులో ఉంది అని ఆ చరిత్ర  మనం  భారతీయ కోణంలో మరియు నిజాన్ని అందుబాటులోకి తెచ్చి చదువుకునే రోజులు దగ్గర లోనే ఉన్నాయని  వీలైనంత తొందరగానే ఆ పని జరిగిపోవాలి అని లేకపోతే భారతీయ యువతలోనూ అలాగే భావిభారత పౌరుల్లోనూ కూడా  విదేశీయుల కంటే తాము చాలా తక్కువ అని భావించడం పోదు  గట్టిగా చెప్పారు. అలాగే అలెగ్జాండర్ ప్రస్తావన తెచ్చిన అయన అలెగ్జాండర్  విశ్వవిజేత అంటూ ఉంటారు ఇప్పటికీ మన దేశంలో చాలామంది కానీ భారతదేశాన్ని జయించకుండా ఆయన విశ్వవిజేత ఎలా అవుతాడు? భారతదేశం మినహా అన్ని దేశాల్నీ జయించి, ఎంతోమంది వధించిన భారతదేశాన్ని జయించడానికి బయలుదేరి, మన సరిహద్దు రాజ్యంగా ఉన్న చిన్న రాజ్యానికి అధిపతియైన పురుషోత్తముని చేతిలోనే ఓడిపోయి, విశ్వవిజేతనని  తనకు తానే ప్రకటించుకొని  ఆయనకు  ఇంత చిన్న రాజు చేతిలో జరిగిన ఓటమిని జీర్ణించుకోలేక తిరుగు ప్రయాణంలోనే కన్నుమూసాడు. 


అసలు ఏంజరిగింది అంటే  గ్రీకు దేశాధిపతి అలెగ్జాండరుగా మహావీరుడుగా  ప్రపంచ విజేతగా యూరప్ చరిత్రకారులు అతనికి స్తుతిస్తూ ఉంటారు కానీ  అలెగ్జాండర్ దృష్టిలో ప్రపంచాన్నంతా గెలవడం ఒకెత్తు సువర్ణ భారతదేశాన్ని గెలవడం ఒకెత్తు అని   చిన్న రాజ్యానికి అధిపతియైన పురుషోత్తముని చేతిలో ఓడిపోయిన తరువాత అనుకున్నాడు అలాగే అతని ఆ  విశ్వవిజేత నన్న కోరిక కలగానే మిగిలిపోయింది.
కానీ పర్షియాలో అలెగ్జాండరు కు అతని సన్నిహితులూ శ్రేయోభిలాషులూ వెళ్లోద్దని హితువు పలికారు. అంతకు రెండు శతాబ్దాల క్రితం నీ లాగే ప్రపంచాన్నంతా జయిస్తూ వచ్చిన సైరస్  అనే రాజు హిందూ వీరుల చేతిలో ఓటమి పాలై మరణించిన విధం వివరించారు. అస్పీరియన్ మహారాణి సమరీమసు జీవితాయశమే హిందూ దేశాన్ని జయించడం. 4లక్షల మంది సైన్యంతో హిందూ దేశం పై దాడి చేసి  ఆమె ఘోరంగా ఓడిపోయి మిగిలిన కొద్దిపాటి సైన్యంతో చావు నుండి తప్పించుకొని వెళ్లిందని వివరించారు. కానీ అలెగ్జాండర్ ముందుకు వెళ్ళడానికే సిద్ధపడ్డాడు. 
పురుషోత్తముడు హిందూ దేశంలో జీలం చీనాబ్ నదుల మధ్య విస్తరించిన చిన్న భూభాగానికి అధిపతి. మహాపరాక్రమశాలి.

పురుషోత్తముని పొరుగు రాజైన తక్షశిలాధిపతి అంబితో వైరం. అంబికీ పురుషోత్తముని ఎదిరించే ధైర్యమూ శక్తీ లేవు. అతని అసూయనూ పగనూ చల్లార్చుకోవడానికి అలెగ్జాండర్ రాక మంచి అవకాశమైంది. అంబి వెళ్ళి అలెగ్జాండర్ ను కలిసాడు. పురుషోత్తమునితో యుద్ధంలో సహకరిస్తే అంబికి 25వేల టన్నుల బంగారంతో పాటూ పురుషోత్తముని రాజ్యాన్ని సైతం కానుకగా ఇవ్వడానికి అలెగ్జాండర్ అంగీకరించాడు.  జీలం నదీ తీర ప్రాంతం చారిత్రక యుద్ధానికి వేదికైంది. అప్పటికే అలెగ్జాండర్ సైన్యం పురుషోత్తముని సైన్యాని కంటే రెట్టింపు. దానికి తోడు అంబి తన  సైన్యంతో అలెగ్జాండర్ ని  కలిసాడు. పురుషోత్తముడు అలెగ్జాండర్ ను  జయించి తన రాజ్యాన్ని బియాస్ నదీ తీర ప్రాంతం వరకూ విస్తరించుకున్నాడని రష్యన్ చరిత్రకారుల అభిప్రాయం.

యుద్ధంలో పురుషోత్తముడు  ఓడిపోయాడనీ కానీ అతను చూపిన శౌర్య పరాక్రమాలకు మెచ్చుకున్న అలెగ్జాండర్ అతని రాజ్యాన్ని తిరిగిచ్చేయడమే గాక ఉత్తరాన బియాస్ నది వరకూ తను ఆక్రమించిన రాజ్యాల్ని కూడా పురుషోత్తముడికి  ఇచ్చి వేసాడని మరొక వాదన.  ఆ పై తన సైన్యం మిక్కిలి అలసిపోవడం వల్ల తన భారత జైత్రయాత్రను అక్కడితో విరమించుకుని తిరుగు పయనమయ్యాడని చరిత్ర. 
కానీ మన చరిత్రకారులు వారి అభిప్రాయాల ప్రకారం  మాత్రమే  భారతదేశాన్నీ భారతీయ రాజుల్నీ గొప్పవారిగా ప్రకటించడం ఇష్టం లేక రకరకాల చారిత్రక వక్రీకరణలకు పాల్గొన్నారు. అలెగ్జాండర్ విశ్వవిజేత కాదు. ఈ విషయాన్ని మనం గ్రహించాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: