గత కొన్ని రోజులుగా వైసీపీ ఎమ్మేల్యే రోజా మీడియాలో కనిపించలేదు. ఎలక్షన్ లకి ముందు ఎంతో ఆక్టివ్ గా ఉండే రోజా అలా ఇనాక్టివ్ అయిపోవడంపై చాలా మంది చాలా కారణాలు చెప్పారు. ఆమెకు మంత్రి పదవి రానందునే రోజా అలా చేస్తున్నారని వార్తలు వచ్చాయి. అయితే అది ఎంతవరకు నిజమో కాదో తెలియదు కానీ, రోజా మరోసారి మీడియా ముందుకి వచ్చారు. ఫైర్ బ్రాండ్ అయిన రోజా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ల పై విరుచుకుపడింది.


ఆంధ్రప్రదేశ్ లో గత కొన్ని ఇసుక మీద ఎంత రాద్దాంతం జరుగుతుందో అందరికీ తెలిసిందే. ఇసుక లేక భవన నిర్మాణ కార్మికుల పరిస్థితి ఆగమ్యగోచరంగా ఉందని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు తమ బాణీని వినిపించారు. పవన్ కళ్యాణ్ లాంగ్ మార్చ్ అంటూ మార్చ్ చేసిన సంగతీ తెలిసిందే. అయితే వాటన్నింటినీ ఉద్దేశిస్తూ రోజా తనదైన శైలిలో స్పందించింది.


చంద్రబాబు గురించి మాట్లాడుతూ, ఎన్నికల్లో ఓడిపోవడం తట్టుకోలేక చంద్రబాబు చిన్న మెదడు చితికిపోయిందని, అందుకే ఏది పడితే అది వాగుతున్నాడని అన్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్నపుడు చేసిన తప్పుల కారణంగానే టీడీపీకి ౨౩ సీట్లు మాత్రమే వచ్చాయని ఎద్దేవా చేశారు. ఇంకా,కరకట్టపై చంద్రబాబు ఉన్న ఇంటిని కూల్చేయాలని హైకోర్ట్ చెప్పినా సిగ్గు లేకుడా ఆయన అక్కడే ఉన్నారని ఆరోపించారు. 


ఈ సంవత్సరం వర్షాలు బాగా పడిన కారణంగానే ఇసుక కొరత ఏర్పడిందని, దానికి చంద్రబాబు, పవన్ కళ్యాన్ పెద్ద రాద్దాంతం చేస్తున్నారని ఆరోపించింది. జగన్ తాను ఎలక్షన్లకి ముందు చెప్పిన అన్ని హామీలని నెరవేర్చే పనిలో ఉన్నాడని, అందువల్లే జగన్ లాంటి ముఖ్యమంత్రి కావాలని పక్క రాష్ట్రం వాళ్ళు అడుగుతున్నారని చెప్పింది


మరింత సమాచారం తెలుసుకోండి: