దాదాపు నెల రోజుల నుండి తెలంగాణ ఆర్టీసీ వారి సమస్య సాగుతూనే ఉంది. సమ్మెల మీద పార్టీకి సమ్మెలు జరుగుతూనే ఉన్నాయి కానీ కేసీఆర్ మాత్రం తాను పట్టిందే పట్టు అంటూ అస్సలు దిగి రావడం లేదు. చూస్తుండే కొద్దీ హైకోర్టు ఓపిక కూడా కొద్ది కొద్దిగా నశిస్తోంది. ఇలాంటి సమయంలో కాంగ్రెస్ పార్టీ నేత భట్టి విక్రమార్క ఒక కొత్త అంశాన్ని తెరమీదకు తెచ్చాడు. అంతా వింటుంటే ఇదంతా నిజంగానే జరిగింది కాబోలు అన్నట్లుగానే ఉన్నాయి ఆయన చెబుతున్న మాటలు.

అసలు విషయం ఏమిటంటే... ఆర్టిసి వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం శాసనసభ కు మరియు హైకోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చిందట. శాసనసభ దగ్గరకు ఈ వ్యవహారం వచ్చినప్పుడే ఈ అంశాన్ని తాము ఖండించామని అయితే తాజాగా హైకోర్టు కూడా ఈ విషయమై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు విక్రమార్క. సీఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన రాజ్యాంగం మరియు న్యాయస్థానాల పై సీఎం కేసీఆర్ కు ఎటువంటి గౌరవం ఉన్నా శాసనసభ, హైకోర్టు మరియు ప్రజలకూ క్షమాపణ చెప్పాలని ఆయన అన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలతోపాటు హైకోర్టు మరియు శాసనసభ్యులను కూడా మోసం చేసిందని ఆయన ఆరోపించారు.

ఇకపోతే ఆర్టీసీ సమ్మెను ఇదే అదనుగా చేసుకుని ఆర్టీసీ ఆస్తులను, ప్రైవేట్ వ్యక్తులకు టిఆర్ఎస్ కట్టబెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ప్రభుత్వం ప్రస్తుతం వ్యవహరిస్తున్న తీరు అత్యంత ప్రమాదకరంగా వుందని అన్న ఆయన గత ప్రభుత్వాలన్నీ ఆర్టీసీ ఆస్తులను కాపాడుకుంటూ వస్తుంటే ఈ ప్రభుత్వం మాత్రం అమ్మకానికి పెడుతోందని తీవ్రస్థాయిలో విమర్శించారు.

ఇప్పుడు బట్టి విక్రమార్క అన్న మాటలతో ఆర్టీసీ కార్మిక సంఘాల యూనియన్ ఈ నెల 9న నిర్వహించనున్న మిలియన్ మార్చ్ మరింత వేడెక్కింది. ఇప్పటికే దీనికి కాంగ్రెస్ పార్టీ తమ సంపూర్ణ మద్దతును ఇస్తున్నట్లు కూడా స్పష్టం చేయడంతో ఒక్కసారిగా వాతావరణం ఒక్కసారిగా హాట్ హాట్ గా మారిపోయింది.


మరింత సమాచారం తెలుసుకోండి: