బంగారం అక్రమ రవాణాపై కొత్త పుంతలు తొక్కుతుంది. కస్టమ్స్ అధికారులు కఠినంగా వ్యవహరిస్తుండటంతో రూటు మార్చిన ఇద్దరు శ్రీలంక మహిళలు,  ఏకంగా కడుపులో 3 కిలోల బంగారు ముద్దల్ని పెట్టుకుని అక్రమ రవాణాకు దిగారు. వారిని ఆసుపత్రికి తరలిస్తుండగా సినిమా ఛేజింగ్ లో మాదిరి 10 దుండగులు కిడ్పాప్ చేసి.. వారికి ఎనిమా చేసి బంగారం తీసుకుని మహిళల్ని వదిలేశారు. చెన్నై పల్లావరం రహదారిలో జరిగిన ఈ సంఘటన సంచలనం సృష్టించింది. 


స్మగ్లర్లలో గోల్డ్ స్మగర్ల రూటే సపరెటయ్యా... నిరూపించారు శ్రీలంక స్మగర్లు. శ్రీలంక నుంచి చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చిన విమాన ప్రయాణీకులను కస్టమ్స్‌ అధికారులు తనిఖీ చేశారు. వీరిలో గర్భం దాల్చినట్టు ఉన్న శ్రీలంకకు చెందిన ఫాతిమా, త్రిషల తీరు అనుమానాస్పదంగా కనిపించింది. వారిద్దరి కడుపులో బంగారపు ముద్దలు ఉన్నట్లు కస్టమ్స్ అధికారులు పసిగట్టారు. అప్రమత్తమైన సిబ్బంది ఆస్పత్రికి తరలించి ఎనిమా ద్వారా బయటకు తీయించే ప్రయత్నంలో భాగంగా కారు ప్రయాణమవగా అంతలోనే ఓ ఉదంతం షాక్ కు గురిచేసింది.    


దారిలో 10 మంది దుండగులు మహిళలిద్దర్ని కిడ్నాప్‌ చేసి చెంగల్పట్టులోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ వారికి ఎనిమా చేయించి కడుపులో ఉన్న బంగారాన్ని ఎత్తుకెళ్లారు. అనంతరం ఆ మహిళలను మీనంబాక్కం సమీపంలో విడిచిపెట్టగా పోలీసు స్టేషన్‌కు వెళ్లి కిడ్నాప్‌ వ్యవహారంపై ఫిర్యాదు చేశారు. శ్రీలంక విమానం ఎపిసోడ్ పూర్తికాకముందే దుబాయి నుంచి వచ్చిన విమానంలో టాయిలెట్‌ వెనుక దాచిన ఐదున్నర కిలోల 48 బంగారు కడ్డీలను కస్టమ్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మార్కెట్లో ఆ బంగారం విలువ రూ.2.24 కోట్లు. మరో కేసులో రూ.11 కోట్ల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.







మరింత సమాచారం తెలుసుకోండి: