ఏపీలో బీజేపీ  ఆకర్ష్ మంత్రం మెల్లగా ఫలిస్తోంది. అటు వైసీపీకి    ఇటు  టీడీపీకి చెందని బ్యాచ్ ని బీజేపీ బాగానే గేలం వేస్తోంది. దాంతో ఆ పార్టీకి ఏపీలో కొత్త బలం వస్తోంది. ప్రధానమైన సామాజికవర్గాల మీద ద్రుష్టి పెట్టిన బీజేపీ అందులో సక్సెస్ అవుతోంది.ఎలాగైనా వచ్చే ఎన్నికల్లో సత్తా చాటాలని చూస్తున్న బీజేపీకి ఇపుడు వలసలే శరణ్యంగా కనిపిస్తున్నాయి.


ఏపీలో చూసుకుంటే టీడీపీ దారుణంగా ఓడిపోయింది. చంద్రబాబు పార్టీలో ఉంటే భవిష్యత్తు లేదనుకునేవారు, వైసీపీలోకి వెళ్లలేని వారు ఇపుడు కమలం వైపు చూస్తున్నారు. అటువంటి వారిని బీజేపీ కూడా జాగ్రత్తగా దగ్గర చేసుకుంటోంది. పశ్చిమ గోదావరి జిల్లాలో బలమైన కమ్మ సామజిక వర్గానికి చెందిన మాగటి బాబు కొద్ది రోజుల్లో బీజేపీలో చేరుతారని ప్రచారం సాగుతోంది. మాగంటి బాబు కాంగ్రెస్ రాజకీయల్లో ఉన్న వారు వైఎస్సార్ మంత్రి వర్గంలో మంత్రిగా పనిచేసిన ఆయన 2014 విభజన తరువాత కాంగ్రెస్ కి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరిపోయారు. ఆయన ఏలూరు నుంచి పోటీ చేసి మంచి మెజారిటీతో గెలిచారు.


ఇక అయిదేళ్ల టీడీపీ ఏలుబడిలో తనకు పెద్దగా ప్రాధాన్యత లేదని భావించిన మాంగటి బాబు అప్పటి నుంచే తగిన సమయం కోసం ఎదురు చూస్తూ వచ్చారు. ఇపుడు సరైన ముహూర్తం చూసుకుని మరీ ఆయన బీజేపీలోకి చేరిపోతున్నారని అంటున్నారు. తనతో పాటు తన కుమారుడు రామ్ జీని కూడా వెంటబెట్టుకుని ఆయన బీజేపీ తీర్ధం పుచ్చుకుంటున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇటీవల పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనకు వచ్చిన పెదబాబు, చినబాబులకు మాగంటి అసలు దర్శనమే ఇవ్వలేదని చెబుతున్నారు.  దాంతో ఆయన టీడీపీకి గుడ్ బై చెబుతారన్నది హై కమాండ్ కి కూడా తెలిసిపోయిందని అంటున్నారు. అయినా మాగంటి బాబు తన నిర్ణయం వెనక్కు తీసుకోరని అంటున్నారు.




మరింత సమాచారం తెలుసుకోండి: