తెలుగుదేశం పార్టీ పెట్టింది ఎవరు అంటే నందమూరి తారకరామారావు అని కచ్చితంగా చెబుతారు. ఆ పార్టీని 1995లో చంద్రబాబు టేకోవర్ చేశారు. అయితే ఆనాటి పరిస్థితులు అలా జరిపించాయని బాబు వర్గం అంటుంది కానీ ఫక్త్ అన్న గారి ఫ్యాన్స్ మాత్రం ఇప్పటికీ టీడీపీలో లేరు. బాబుకు దూరంగానే ఉంటూ వచ్చారు.


వారే 2004, 2009 ఎన్నికల్లో వైఎస్సార్ ని, ఇపుడు జగన్ని గెలిపించారని కూడా అంటారు. నందమూరిని బాబు వెన్నుపోటు పొడవడం రియల్ ఫ్యాన్స్ కి ఎప్పటికీ నచ్చని విషయమే. ఇక ఎన్టీయార్  సతీమణి లక్ష్మీ పార్వతి తోనే గొడవ మొదలైంది కాబట్టి ఆమె బాబుకు యాంటీ గ్రూప్ లోనే ఉంటారంటే అర్ధం చేసుకోవచ్చు. మరి అన్నగారికి సన్నిహితుడైన యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ ఇపుడు వైసీపీలో  ఉన్నారు. అలాగే టీడీపీకి మొదట్లో  బలంగా నిలిచిన  దాసరి బాలవర్ధనరావు వంటి వారు కూడా ఎన్నికల సమయంలో వైసీపీలో చేరారు.


మరో వైపు సినీ నటుడు తన చివరి సినిమా మేజర్ చంద్రకాంత్ తో మళ్లీ అన్న గారికి స్టార్ డం తెచ్చిన మోహన్ బాబు కూడా వైసీపీలోనే ఉన్నారు. సినీ రంగంలో అన్న గారు అంటే అభిమానించి రాజకీయాల్లో మొదట టీడీపీలో చేరిన క్యారక్టర్ నటుడు గిరిబాబు కూడా వైసీపీనే. ఇలా చెప్పుకుంటూ పోతే అన్న గారి అసలైన అభిమానులు అంతా వైఎస్సార్ ఫ్యామిలీతో ఉండడం ఆశ్చర్యంగా ఉన్నా వారిదే కరెక్ట్ డెసిషన్ అనిపించకమానదు. 


ఎందుకంటే వారికి బాబు ఓటమి కావాలి. బాబు అన్న గారికి వెన్నుపోటు పొడిచాడు కాబట్టి ఆయన ఓడాలి. అలా ఎవరైతే బలంగా ఎదురు నిలిచి పోరాడుతారో వారి వైపే అన్న గారి అభిమానులు కానీ ఆయనతో చనువు ఉన్న వారు కానీ చేరుతున్నారని అంటున్నారు. ఇక దగ్గుబాటి వెంకటేశ్వరరావు కూడా వైసీపీలో చేరినా తన సతీమణి బీజేపీలో ఉండ‌డంతో కొనసాగలేకపోయారు. మొత్తం మీద చూసుకుంటే అసలైన అన్న గారి ఫ్యాన్స్ ఎపుడూ టీడీపీతో లేరని అర్ధమవుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: