మద్య నియంత్రణ కోసం అనేక సంస్కరణలు తీసుకు వచ్చిన జగన్ సర్కార్ ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసింది.  ఇప్పటికే మద్యం దుకాణాల సంఖ్య తగ్గించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి , రాష్ట్రంలో బార్ల సంఖ్యను కూడా కుదించాలని అధికారులను ఆదేశించారు.  ప్రభుత్వానికి వివిధ శాఖల ద్వారా  వస్తున్న ఆదాయాల పై క్యాంపు కార్యాలయంలో  సమీక్ష సమావేశం నిర్వహించిన ఆయన,  మద్య నియంత్రణ కోసం మరిన్ని చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు . వచ్చే ఏడాది జనవరి 1వ తేదీ నుండి  ఉదయం 11 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే  బార్లలో మధ్యం విక్రయించాలని జగన్మోహన్ రెడ్డి  అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.


ఇక  బార్లకు అనుమతి ఇచ్చే ప్రదేశాల్లో అధికారులు జాగ్రత్త వహించాలని సూచించారు.  ప్రజలకు ఇబ్బందులు లేని ప్రాంతాల్లో మాత్రమే బార్లు   ఉండాలన్న ఆయన,  ఈ మేరకు విధానాలను ఖరారు చేయాలని అధికారులను ఆదేశించారు.  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో మద్య నియంత్రణ కోసం అనేక చర్యలను చేపట్టింది.  పొరుగునే ఉన్న తమిళనాడు రాష్ట్రంలో మాదిరిగా రాష్ట్రం లో  ప్రభుత్వమే మద్యం దుకాణాలను నిర్వహించాలని నిర్ణయించింది .  మద్యం దుకాణాల నిర్వహణ ద్వారా నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలని భావించిన  జగన్ సర్కారు,  ఈ మేరకు మద్యం అమ్మకాలను నిర్వహించే బాధ్యతలను నిరుద్యోగ యువతకు అప్పగించారు . 


గతం లో రాష్ట్రం లో పెద్ద ఎత్తున బెల్ట్ షాప్ ల ద్వారా మద్యం విక్రయాలు కొనసాగగా , వైస్సార్ కాంగ్రెస్ సర్కార్ అధికారం లోకి వచ్చిన తరువాత బెల్ట్ షాప్ లపై ఉక్కుపాదాన్ని మోపారు . దీనితో బెల్ట్ షాప్ ల ద్వారా మద్యం విక్రయాలను పూర్తిగా నియత్రించింది . 


మరింత సమాచారం తెలుసుకోండి: