ఈ నెల 17వ తేదీలోగా సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ తీర్పును వెల్లడించనున్నారు. సోషల్ మీడియాపై ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు నిఘా పెంచారు. తీర్పు ఒక వర్గానికి అనుకూలంగా వస్తే మరో వర్గం రెచ్చిపోయే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం అయోధ్యలో ప్రభుత్వం భద్రతా చర్యలు పెంచుతూ వస్తుండటంతో అప్రకటిత కర్ఫ్యూ వాతావరణం నెలకొంది. ఉత్తరప్రదేశ్ డీజీపీ ఓపీ సింగ్ సోషల్ మీడియాలో పిచ్చి వార్తలు రాసినా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినా ఊరుకోమని అన్నారు. 
 
ఎంపీలకు, బీజేపీ పార్టీ ముఖ్య నేతలకు, కేబినేట్ సహచరులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇప్పటికే కీలకమైన ఆదేశాలు జారీ చేశారు. ఎలాంటి అవాంఛనీయ పరిస్థితులు తలెత్తకుండా కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటోంది. కేంద్ర ప్రభుత్వం ముఖ్య నేతలకు, క్యాడర్ కు, సంఘ్ పరివార్ కార్యకర్తలకు ఆర్.ఎస్.ఎస్. కు కీలక సూచనలు జారీ చేసింది. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ అదిత్యనాథ్ మంత్రులు అయోధ్య విషయంలో ఎలాంటి వ్యాఖ్యలు చేయరాదని ఆదేశాలు జారీ చేశారు. 
 
నిన్న జరిగిన మంత్రివర్గ భేటీలో మోదీ తన కేబినేట్ సహచరులకు శాంతి భద్రతలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అయోధ్య అంశంపై ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దని చెప్పినట్లు సమాచారం. బీజేపీ పార్టీ ఎమ్మెల్యేలు,మంత్రులు, ఎంపీలు తమ తమ ప్రాంతాల్లో శాంతి సామరస్యాలు కొనసాగేలా చర్యలు చేపట్టాలని బీజేపీ చీఫ్ అమిత్ షా ఆదేశించినట్లు తెలుస్తోంది. 
 
ప్రధాని నరేంద్ర మోదీ సుప్రీం కోర్టు తీర్పును తీర్పుగానే చూడాలని ఓటమి గెలుపు ప్రస్తావన రాకుండా చూడాలని పిలుపునిచ్చారు. బీజేపీ పార్టీ ఎంపీలకు తమ తమ నియోజకవర్గాల్లో శాంతి నెలకొల్పే ప్రయత్నం చేయాలని పేర్కొంది. అనుకూలంగా తీర్పు వచ్చినా సంబరాలకు దూరంగా ఉండాలని ఆర్.ఎస్.ఎస్. కార్యకర్తలకు సూచించింది. డిసెంబర్ 10 వరకు 144 సెక్షన్ విధిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అక్టోబర్ 16వ తేదీన సుప్రీం కోర్టు తీర్పును రిజర్వ్ లో ఉంచింది. నవంబర్ 17వ తేదీన జస్టిస్ రంజన్ గొగోయ్ పదవీ విరమణ నేపథ్యంలో అయోధ్యపై తీర్పు వెలువడే అవకాశం ఉంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: