రాష్ట్ర ప్రభుత్వాలకు భాధ్యత తెలియక పోవటం మన దురదృష్టం. విశ్వనగరం అంటూ మందీ మార్బలంతో ప్రపంచం చుట్టేసిన "లోకం చుట్టిన వీరుడు" గా మిగిలిపోయిన నారా చంద్రబాబు నాయుడు గారు కనీసం "రాష్ట్ర రాజధాని పై రాజపత్రం" ప్రకటించాలనే సాధారణ పరిఙ్జానం లేకపోవటం సిగ్గుచేటు. దరిమిలా దేశ రాజకీయ చిత్రపటం లో మన ‘అమరావతి’ లేకుండా పోయింది.

తెలంగాణలో ఆర్టీసీ సమ్మెపై హైదరాబాద్ హైకోర్టులో నేడు (గురువారం) జరిగిన విచారణ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తరపున "అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్" రాజేశ్వర రావు  వాదనలు వినిపించారు. కేంద్రానికి ఆర్టీసీలో 33 శాతం వాటా ఉందని, 2014 లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత నేటికీ ఆర్టీసీ విభజన పూర్తి కాలేదని ఆయన హైదరాబాద్ హైకోర్టుకు తెలిపారు.
Image result for rtc kcr before High Court
అలాంటప్పుడు టీఎస్ ఆర్టీసీకి అనేదానికి అర్ధమే లేదని – దానికి చట్టబద్ధత ఎక్కడుందని అంటూ తన వాదనలను బలంగా వినిపించారు. నేరుగా టీఎస్-ఆర్టీసీకి, ఏపీఎస్ ఆర్టీసీ ఆస్తులు బదిలీ అవుతాయనే వాదనల్లో కూడా నిజం లేదని కోర్టుకు విన్నవించారు.  కేంద్రం వాదనలు విన్న హైకోర్టు, ఆర్టీసీ విభజన జరగకుండా ఉనికే లేని టిఎస్ ఆర్టీసి అంటూ నోటిఫికేషన్ ఎలా ఇస్తారని తెలంగాణా ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. తాజా వాదనతో ఇటు కేసీఆర్ నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం, అటు జగన్ నాయకత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం  రెండింటికీ శిరోభారంగా పరిణమించ నుందని విశ్లేషకులు అంటున్నారు.

కేంద్రానికి చెప్పకుండా విభజన జరగకుండా సొంతంగా నిర్ణయాలు తీసుకోవటం తప్పని రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియదా! అని ప్రశ్నిస్తున్నారు. 33% భాగస్వామ్య వాటా ఉన్న కేంద్ర అనుమతి లేకుండానే  “తెలంగాణలో ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణ” కానీ, ఏపీలో ఏపిఎస్-ఆర్టీసీ విలీనం కానీ రెండూ కూడా చట్టబద్ధమైన విషయాలు ఎన్నటికి కావనే మాటను కేంద్రం చెప్పకనే చెప్పిందన్న వాదనలు వినిపిస్తున్నాయి.
Image result for rtc kcr before High Court
కేంద్రం వాదనలు ఆర్టీసీ కార్మికుల్లో నూతన ఉత్సాహం నింపుతుందని అంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వ బెదిరింపు ధోరణి నుంచి వారికి దాదాపు ఉపశమనం లభించినట్టేనని అంటున్నారు. ఇలా మన ముగ్గురు అధినేతల అఙ్జాన్ని మనం తప్ప ఈ ప్రపంచంలో ఎవరూ క్షమించగలరు.

Image result for rtc kcr before high court

మరింత సమాచారం తెలుసుకోండి: