ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత పవన్ కల్యాణ్ చాలా రోజులు సైలెంట్ అయిపోయిన విషయం తెలిసిందే. అప్పుడప్పుడు నేతలతో సమీక్షా సమావేశాలు ఏర్పాటు చేసినా...మళ్ళీ సైలెంట్ అయిపోయేవారు. అయితే ఈ మధ్య పవన్ ఫుల్ యాక్టివ్ అయినట్లు కనిపిస్తున్నారు. గత కొన్ని రోజులుగా పవన్.....వైసీపీ ప్రభుత్వంపై పలు విషయాల్లో విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక ఇసుక విషయంలో మాత్రం పవన్ మరో అడుగు ముందుకేసి వైసీపీపై విరుచుకుపడుతున్నారు.


పవన్ విమర్శలు చేస్తే వైసీపీ నేతలు ఏమైనా ఊరుకుంటారా... వాళ్ళు కూడా పవన్ పై ఘాటుగా కామెంట్లు చేస్తున్నారు. అందులోనూ పవన్ సామాజికవర్గానికి చెందిన వైసీపీ నేతలే పవన్ ని టార్గెట్ చేసుకుని మాట్లాడుతున్నారు. ముఖ్యంగా మంత్రులు బొత్స సత్యనారాయణ, అవంతి శ్రీనివాస్, కన్నబాబు, ఎమ్మెల్యే అంబటి రాంబాబు, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహన్ లు పవన్ అంటే ఒంటి కాలి మీద వెళుతున్నారు. పవన్ కూడా వీరిని పర్సనల్ గా టార్గెట్ చేసుకుని విమర్శలు చేస్తున్నారు.


దీంతో వైసీపీ నేతలు కూడా ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా పవన్ పై వరుసగా విరుచుకుపడుతున్నారు. ఇక్కడొక చెప్పుకోదగిన విషయం ఏమిటంటే...ఈ వైసీపీ నేతలకు చిరంజీవి అంటే ఇష్టం. కానీ పవన్ అంటే మంట. దానికి కారణం పవన్-చంద్రబాబుతో సన్నిహితంగా మెలగడమే అని అర్ధమవుతుంది. 2014లో పవన్...చంద్రబాబుకు సపోర్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత విడిపోయిన వీరి మధ్య పరోక్ష స్నేహం కొనసాగిందని మొన్న ఎన్నికల్లో రుజువైంది.
ఇక ఎన్నికల్లో రెండు పార్టీలు ఘోరంగా ఓడిపోవడం, ప్రతిపక్షంలోకి వెళ్ళడం జరిగాయి.

అప్పటి నుంచి రెండు పార్టీలు ఒకే లైన్ లో వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. పైగా ఇటీవల లాంగ్ మార్చ్ సందర్భంగా వీరి స్నేహం మరింత బలపడింది. అందుకే వైసీపీ నేతలు పవన్...చంద్రబాబుకు దత్తపుత్రుడుని విమర్శిస్తున్నారు. కాపు నేతలైతే ఓ రేంజ్ లో పవన్ పై మండిపడుతున్నారు. మొత్తానికి పవన్...చంద్రబాబుతో కలిసి తమపై విమర్శలు కాపు నేతల కోపానికి కారణమైంది.


మరింత సమాచారం తెలుసుకోండి: