ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పడి కేవలం అయిదు నెలలు కావొస్తుంది... ఈ అయిదు నెలల్లో ప్రభుత్వం మొదలుపెట్టిన సంక్షేమ కార్యక్రమాల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. రైతు భరోసా, కంటి వెలుగు, వైఎస్సార్ వాహన మిత్ర, 4 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఈ విధంగా ఒక్కొక్క కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేస్తూ ప్రభుత్వం దూసుకుపోతుంది. ముఖ్యంగా నమ్మి ఓట్లు వేసిన ప్రజలకు జగన్ నిర్ణయాలు ఆకట్టుకునే విధంగా ఉన్నాయి.

పాదయాత్రలో ఇచ్చిన హామీలను ఆయన దూకుడు గా అమలు చేయడంపై, అటు ప్రజల్లో, ఇటు రాజకీయ వర్గాల్లో హర్షం వ్యక్తమవుతుంది. సోషల్ మీడియా వేదికగా, తమ అనుకూల ఎలక్ట్రానిక్ మీడియా వేదికగా తెలుగుదేశం ఎంత ప్రచారం చేసినా సరే వాస్తవాలు మాత్రం ప్రజలకు అర్దమవుతున్నాయి అనేది పరిశీలకుల మాట. అనుభవం లేని జగన్ దూకుడు గా ప్రభుత్వ పథకాలకు నిధులు కేటాయిస్తున్నారు. అమ్మ ఒడి లాంటి కీలక పథకానికి కూడా శ్రీకారం చుట్టారు. ఇక రైతు భరోసా పథకం విషయంలో రైతుల్లో హర్షం వ్యక్తమైంది. చంద్రబాబు ఇచ్చిన దానికంటే ఇది మెరుగే అనే అభిప్రాయ౦ వారిలో వ్యక్తమవుతుంది.


అసలు నిధులు లేని రాష్ట్ర ప్రభుత్వం... ఈ విధంగా ఎలా పథకాలను అమలు చేస్తుంది అనేది ప్రజలకే కాదు ఆర్ధిక వేత్తలకు కూడా అర్ధం కాని పరిస్థితి. దూకుడు నిర్ణయాలు తీసుకునే జగన్... అదే దూకుడు ఉండే అధికారులను తన టీం లో పెట్టుకున్నారని అంటున్నారు. ముఖ్యంగా కీలకమైన ఆర్ధిక శాఖలో, రెవెన్యు శాఖల్లో జగన్ నియమించిన అధికారులు అనుభవం ఉన్న వారు కావడం జగన్ కి కలిసి వచ్చింది. ఎప్పటికప్పుడు జగన్ వారితో సమావేశమవుతు నిధుల గురించి చర్చిస్తున్నారు. ఇచ్చిన హామీలను అమలు చెయ్యాల్సిందే అనే పట్టుదల జగన్ లో కనపడటం కూడా అధికారులలో హుషారు పెంచుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: