రాజకీయ నాయకులందరికీ ఎవరి వ్యూహాలు వారికి ఉంటాయి. కానీ  ప్రత్యర్థులకు షాక్  ఇవ్వడానికి రాజకీయ నేతలందరూ ఎక్కడికప్పుడు వ్యూహాలను  మార్చుకుంటారు. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కొత్త వ్యూహంతో ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవలె గత కొన్ని రోజులుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డివైసిపి పార్టీ నేతలను  ఎక్కువ టార్గెట్ చేస్తూ తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే టీడీపీ అధినేత చంద్రబాబు సపోర్ట్ తోనే పవన్ కళ్యాణ్ ఈ రకంగా తమ  పార్టీపై తీవ్ర విమర్శలు చేస్తున్నారని వైసిపి భావిస్తోంది. ఈ మేరకు బహిరంగ విమర్శలు కూడా చేస్తుంది వైసిపి. 



 ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ను కట్టడి చేసేందుకు ముఖ్యమంత్రి జగన్ కొత్త వ్యూహంతో ముందుకు కదులుతున్నట్లు సమాచారం. దాని అమలులో భాగంగానే  సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు ను  పరామర్శించారని  ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చలు  నడుస్తున్నాయి. గత ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన  పార్టీతో కలిసి ముందుకు సాగిన వామపక్ష పార్టీలు అన్ని...  ఆ తర్వాత పవన్ కి దూరం అయ్యాయి. తాజాగా విశాఖ లో ఇసుక సమస్యపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిర్వహించిన  లాంగ్ మార్చ్ కు  కూడా సిపిఐ సిపిఎం పార్టీలు దూరంగానే ఉన్నాయి . ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి వామపక్షాలను దగ్గర చేసుకునే పనిలో పడ్డారని సమాచారం. దీని కోసం కొత్త ప్లాన్ తో ముందుకు సాగుతున్నారని ఈ నేపథ్యంలోనే సీపీఎం  రాష్ట్ర కార్యదర్శి మధు కలిసి జగన్ పరామర్శించారు అని  రాజకీయవర్గాల్లో చర్చించుకుంటున్నారు . 



 ఆకస్మాత్తుగా ఎన్నడూ లేనిది జగన్  సిపిఎం రాష్ట్ర కార్యదర్శి ని  కలవడం పరామర్శించడం ప్రస్తుతం ఆంధ్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను వామపక్షాలు దూరం చేయడం వల్ల ఆయన బలం తగ్గి  కాస్త కి సైలెంట్ అవుతారని జగన్ భావిస్తున్నారట. అంతేకాకుండా వామపక్షాలన్ని  వైసీపీ వెంట నడిస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో తమకు లాభం చేకూరే అవకాశం ఉందని భావిస్తున్నారట. అయితే ప్రస్తుతం జగన్ వ్యూహం తో అటు పవన్ సైలెంట్ అయిపోయాడంతో  పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో  కూడా వైసిపికి కలిసి వచ్చే అవకాశం ఉందని... అందుకే నయా ప్లాన్ తో జగన్ ముందుకు సాగుతున్నారని అందరూ భావిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: