తాను ఇచ్చిన మాటను ఎట్టి పరిస్థితుల్లో తప్పేది లేదని జగన్ తరుచు చెబుతుంటారు. దానికనుగుణంగానే జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వస్తున్నారు. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది. మధ్య నిషేధం. మధ్య  నియంత్రణ దిశగా జగన్ వేసిన తొలి అడుగులోనే ఏకంగా వెయ్యి వైన్ షాపుల మేర తగ్గిపోగా.. గ్రామాల్లో బెల్టు షాపులు దాదాపుగా కనుమరుగైపోయాయి. తాజాగా గురువారం ఈ దిశగా జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం అమలు జనవరిలోనే అమలు కానున్నా... జగన్ తీసుకున్న ఈ నిర్ణయంతో రాష్ట్రంలో మద్య నిషేధం పూర్తిగానే అమలు కానుందన్న వాదనలు వినిపిస్తున్నాయి.


జగన్ తన పాదయాత్రలో .. పేద ప్రజలను నాశనం చేస్తున్న మధ్య నిషేధాన్ని అమలు చేస్తానని చెప్పిన సంగతీ తెలిసిందే. అంతే కాకుండా టీడీపీ హయాంలో పల్లెల్లో పుట్టగొడుగుల్లా వెలసిన బెల్టు షాపుల తాట తీస్తామని కూడా జగన్ నాడు సంచలన ప్రకటన చేశారు. మొన్నటి ఎన్నికల్లో జనం భారీ మద్దతుతో అధికారంలోకి వచ్చిన వెంటనే జగన్... రాష్ట్రంలో మద్యనిషేధం దిశగా చర్యలు ప్రారంభించేశారు. అప్పటిదాకా అమలులో ఉన్న ఎక్సైజ్ పాలసీని సమూలంగా మార్చేసిన జగన్.. రాష్ట్రంలో మద్యం విక్రయాలన్నింటినీ సర్కారీ పరిధిలోకి తీసుకొచ్చేశారు. అంతకంటే ముందే.. గ్రామాల్లోని బెల్టు షాపులను పూర్తిగా మూయించి పారేశారు.


జగన్ తాజాగా ఆదాయార్జన శాఖల అధికారులతో భేటీ అయ్యి కొన్ని కీలక నిర్ణయాలను చర్చించారు.  వైన్ షాపులను తగ్గించిన  మాదిరిగానే త్వరలో బార్ల సంఖ్యను కూడా కుదించేయాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే జనవరిలో అమలు చేయనున్న ఈ నిర్ణయం ప్రకారం... ఎన్ని బార్లను కుదించేయొచ్చన్న విషయంపై అధ్యయనం చేయాలని కూడా ఆయన అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా ప్రజలకు ఇబ్బంది కలగని ప్రాంతాల్లోనే బార్లను కొనసాగించేలా చర్యలు చేపట్టాలని కూడా జగన్ సూచించారు. ప్రజలు వద్దన్న ప్రాంతాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ బార్లకు అనుమతులు ఇవ్వవద్దని కూడా ఆయన కాస్తంత కఠిన ఆదేశాలనే జారీ చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: