వంశీ టీడీపీలో ఉండరని...వైసీపీలోకి ఖాయంగా వస్తారని వైసీపీ ముఖ్య నేతలు అంటున్నారు. వంశీ టీడీపీలోఇమడలేని పరిస్థితి ఆ పార్టీ నేతలే తీసుకొచ్చారని వినిపిస్తుంటే.... ఆయన అక్కడ ఉండలేకనే నేరుగా వచ్చి ముఖ్యమంత్రితో సమావేశమయ్యారని.. అసలు వంశీ టీడీపీ వీడటం వెనుక కేసులు..వ్యవహారాలు కాదని..అసలు విషయం  అక్కడ చినబాబు వంశీని అవమానించే విధంగా మాట్లాడారని..అది జీర్ణించుకోలేకనే వంశీ పార్టీ వీడుతున్నారఅంటున్నారు.


 వంశీ వాట్సప్ మెసేజిల ద్వారా టీడీపీ వీడుతున్నట్లు..ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు టీడీపీ అధినేత చంద్రబాబుకు సమాచారం ఇచ్చారు. చంద్రబాబు ఆ వెంటనే వంశీని బుజ్జగించే ప్రయత్నలో వంశీతో చర్చల కోసం ఇద్దరు నేతలను రంగంలోకి దించారు. అయినా వంశీ మొత్తబడలేదు. ఇదే సమయంలో అసలు జగన్ ను కలవటానికి ముందే వంశీ టీడీపీ అగ్ర నేతలను కలిసారు. వారికి తన సమస్యలను..ఇబ్బందులను వివరించారు. ఆ సమయంలో జరిగిన పరిణామాలే వంశీ మనస్థాపానికి కారణంగా చెబుతున్నారు.

వంశీ తన మీద కేసులు నమోదు అయిన తరువాత పార్టీ అధినేత చంద్రబాబును కలిసి తన సమస్యలు చెప్పుకోగా..ఆయన ధైర్యం చెబుతూ..అధికారం కోల్పోయిన సమయంలో బలమైన నాయకుల మీద ఇలాగే వ్యవహరిస్తారని..దైర్యంగా ఎదుర్కోవాలని సూచించినట్లు సమాచారం. ఆ తరువాత వంశీ పార్టీ నేత లోకేశ్ తో కూడా సమావేశమయ్యారని కానీ లోకేశ్ స్పందించిన తీరుతో వంశీ బాధపడ్డారని చెబుతున్నారు.

పార్టీలో నీకు ఒక్కడికే కాదు సమస్యలు.. నీకన్నా చిన్నదైన మాజీ మంత్రి అఖిల మీద కేసులు పెట్టి వేధిస్తున్నారు...ధైర్యంగా ఎదుర్కోటోంది కదా.సీనియర్ అయి ఉండి..ఇలా చేస్తే ఎలా అంటూ లోకేశ్ చేసిన వ్యాఖ్యలతో వంశీ తన మనసు గాయపడిందని తన సన్నిహితులతో చెప్పినట్లు సమాచారం. ఆ వెంటనే ఇక పార్టీ నుండి తనకు మద్దతు ఉండదనే భావనతో ఆయన వెంటనే పార్టీ మారాలని నిర్ణయించారని చెబుతున్నారు. అయితే, ముఖ్యమంత్రి జగన్ ను కలిసి వ్యక్తిగతంగా ఏ అంశం చర్చించారనేది మాత్రం తెలియటం లేదు. కేసుల మీదనే చర్చించారని అంచనాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పుడు ఈ వ్యవహారంపై వైసీపీ క్యాంపులో జోరుగా చర్చించుకంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: