ప‌క్క‌లో బ‌ల్లెంలా మారిన పాక్ త‌న కుయుక్త‌ల‌ను మ‌రింత ఎక్కువ‌గా చేస్తోంది. భార‌త‌దేశానికి చెందిన ఆర్మీ టార్గెట్‌గా కొత్త ఆప‌రేష‌న్‌కు దిగింది. డబ్బుకు ఆశపడి  ఓ భారత ఆర్మీ జవాన్ పాకిస్తాన్ కు చెందిన ఓ లేడి ఐఎస్ఐ  ఏజెంట్‌కి ఆర్మీ గురించిన కీలక సమాచారం అందించాడు. పాకిస్తాన్ కు చెందిన ఆ మహిళా ఏజెంట్ కి సోషల్ మీడియా ద్వారా సీక్రెట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేశాడన్న ఆరోపణలతో అతన్ని రాజస్థాన్ పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే, ఈ అరెస్టుతో మ‌రిన్ని సంచ‌ల‌న అంశాలు వెలుగులోకి వ‌చ్చాయి.


 అమ్మాయిల ముసుగుతో మన సైనికులపైకి వల (హనీట్రాప్) విసురుతోంది. ఈ కుట్రలకు సోషల్ మీడియానే వేదికగా ఎంచుకుంటోంది పాక్ ఆర్మీ. కుటుంబానికి దూరంగా ఉంటూ సరిహద్దులో పహారా కాస్తున్న జవాన్లకు మత్తుగా మాటలు చెప్పి.. నెమ్మదిగా లోబరుచుకుని ‘ట్రాప్’లోకి దింపుతోంది. తమ మాయలో పడ్డాక సైనిక, ఆయుధ స్థావరాల వివరాలను కూపీ లాగుతోంది. తాజాగా రాజస్థాన్‌లో ఇద్దరు ఆర్మీ జవాన్లు పాక్ ఆర్మీ హనీట్రాప్‌లో పడ్డారు. లాన్స్‌ నాయక్ రవి వర్మ, సిపాయి విచిత్ర బెహెరా పాక్ ఇంటెలిజెన్స్‌ వలలో చిక్కారని గుర్తించి రాజస్థాన్ పోలీసులు వారిని అరెస్టు చేశారు. పాక్ హనీ ట్రాప్ ఐడీలను ట్రాక్ చేస్తున్న మన ఆర్మీ వారిని పట్టుకోగలిగింది.


ఈ నేప‌థ్యంలో ప‌లు సంచ‌ల‌న అంశాలు ఆర్మీ గుర్తించింది. హనీట్రాప్‌ల కోసం ప్రత్యేకంగా 150 ఫేస్ బుక్ ఐడీలను పాక్ క్రియేట్ చేసిన‌ట్లు ఆర్మీ గుర్తించింది.  ఫేస్‌బుక్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫాంల ద్వారానే జవాన్లను టార్గెట్ చేస్తున్నట్లు వెల్ల‌డించింది. ఆయా ఆ ఐడీలను ట్రాక్ చేసిన భారత ఇంటెలిజెన్స్ వర్గాలు వాటి జోలికె వెళ్లొద్దని హెచ్చరించింది. బాబాలు, ఆధ్యాత్మికవేత్తల పేర్లతో కూడా ఇటీవల ఆర్మీ జవాన్లను ట్రాప్ చేయడానికి పాక్ కుట్ర చేస్తోందని తెలిపింది. గుర్తు తెలియని వ్యక్తులు, ముఖ్యంగా పరిచయం లేని మహిళలు, మత గురువుల ఐటీల నుంచి ఎటువంటి మెసేజ్‌లు వచ్చినా స్పందించొద్దని స్ప‌ష్టం చేసింది.  ఆర్మీ హెడ్ క్వార్టర్స్ లేదా ఇన్సూరెన్స్ ఏజెన్సీల నుంచి ఫోన్  చేస్తున్నట్లుగా చెప్పి.. సమాచారం లాగే చాన్స్ ఉందని ఆర్మీ హెచ్చరించింది . ఆర్మీ అధికారులు, జవాన్ల సోషల్ మీడియా ఐడీలు, ఫోన్ నంబర్లను దొంగిలించేందుకు పాక్ కుట్రలు చేస్తోందని హెచ్చ‌రించింది. సోషల్ మీడియా వేదికగా అసలు ఎటువంటి పర్సనల్, సెన్సిటివ్ సమాచారాన్ని ఎవరితోనూ షేర్ చేసుకోవద్దని ఆర్మీ సిబ్బందికి సూచించింది.


మరింత సమాచారం తెలుసుకోండి: