గత నెల రోజులుగా తెలంగాణాలో ఆర్టీసీ కార్మికుల సమ్మె జరుగుతున్న సంగతి అందరికి తెలిసిందే. దీంతో తెలంగాణలోని ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. అయితే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. 

                                   

అయితే నేడు తెలంగాణలో ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో కేంద్ర ప్రభుత్వం వాదనలు విని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఒక్కసారిగా తలనొప్పి తెచ్చిపెట్టాయి. కేంద్ర ప్రభుత్వం కూడా తన వాదనలను హైకోర్టులో వినిపించింది. అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ రాజేశ్వరరావు కేంద్రం తరఫున వాదనలు వినిపించారు.

                                 

కేంద్రానికి ఆర్టీసీలో 33శాతం వాటా ఉందని, 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఈరోజుకి ఆర్టీసీ విభజన పూర్తి కాలేదని ఆయన కోర్టుకు తెలిపారు. అలాంటి సమయంలో టీఎస్ఆర్టీసీకి చట్టబద్ధత ఎక్కడ ఉందని తన వాదనలను బలంగా వినిపించారు. నేరుగా టీఎస్ ఆర్టీసీకి ఏపీఎస్ఆర్టీసీ ఆస్తులు బదిలీ అవుతాయనే వాదనల్లో కూడా ఎంతమాత్రం నిజం లేదని కోర్టుకు విన్నవించారు. 

                                  

కేంద్రం వాదనలు విన్న హైకోర్టు.. ఆర్టీసీ విభజన జరగకుండా నోటిఫికేషన్ ఎలా ఇస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. కేంద్రానికి చెప్పకుండా సొంతంగా నిర్ణయాలు కుదరవని, కేంద్రానికి 33 శాతం వాటా ఉన్న కేంద్రం అనుమతి లేకుండా తెలంగాణలో ఆర్టీసీ రూట్లు ప్రైవేటీకరణ చెయ్యలేరని, అటు ఏపీలో కూడా విలీనం కుదరదని వాదనలు వినిపించారు. దీంతో ఈ ఆర్టీసీ విలీనం ప్రస్తుతం ఏపీ సర్కార్ కి కూడా తలనొప్పి తీసుకొచ్చి పెట్టింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: