ఔను  జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేయ‌లేని ప‌నిని....వైసీపీ అధినేత‌, ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి చేసి చూపించారు. ప‌క్కా రాజ‌కీయ‌నాయ‌కుడిగా ప‌వ‌న్ వ్య‌వ‌హ‌రిస్తే....హుందా రాజ‌కీయాల‌కు చిరునామాగా జ‌గ‌న్ న‌డుచుకున్నారు. ఇంకా చెప్పాలంటే...ప‌రిణ‌తి చెందిన నాయ‌కుడిగా...ప‌వ‌న్ కంటే ఓ మెట్టు పైనున్న నేతగా....జ‌గ‌న్ నిరూపించుకున్నారు. ఇటీవల మోకాలికి శస్త్ర చికిత్స చేయించుకున్న సీపీఎం పార్టీ ఏపీ రాష్ట్ర కార్యదర్శి పి. మధును సీఎం జగన్ పరామర్శించడం ద్వారా ఈ చ‌ర్చ‌ను పలువురు ప్ర‌స్తావిస్తున్నారు. విజయవాడలోని ఓ ఆస్పత్రిలో మధు మోకాలికి శస్త్ర చికిత్స జరిగింది. ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అనంతరం ఆయన ఇంట్లో ఉంటూ విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ నేప‌థ్యంలో....తాడేపల్లిలోని ఆయన నివాసానికి వెళ్లిన సీఎం జ‌గ‌న్‌..వామ‌ప‌క్ష నేత‌ మధుతో మాట్లాడారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.


ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల్లో వామ‌ప‌క్షాలైన సీపీఐ, సీపీఎం పార్టీల‌తో పాటుగా జ‌న‌సేన క‌లిసి పోటీ చేసిన సంగ‌తి తెలిసిందే. వివిధ ఆందోళ‌నలు కూడా నిర్వ‌హించాయి. ఈ నెల 3న విశాఖలో లాంగ్‌ మార్చ్ సంద‌ర్భంగా కూడా..ఈ ప‌క్షాలు క‌లిసి వ‌స్తాయ‌ని అనుకున్నారు. రాష్ట్రంలో ఇసుక కొరత.. భవన నిర్మాణ కార్మికుల సమస్యల మీద ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈ మార్చ్ నిర్వహిస్తున్నామ‌ని...ఇందులో అన్ని పార్టీలను భాగస్వాములను చేయాలని భావించాన‌ని పేర్కొంటూ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆయా నేత‌ల త‌న‌కు మ‌ద్ద‌తివ్వాల‌ని కోరారు.

  టీడీపీ అధ్య‌క్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో సహా.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అదే విధంగా వామపక్ష పార్టీల రాష్ట్ర కార్యదర్శులు రామ‌కృష్ణ‌, మ‌ధుకు పవన్ స్వయంగా ఫోన్ చేసి ఆహ్వానించారు. అయితే, ఇప్పుడు వామపక్ష పార్టీలైన‌ సీపీఐ, సీపీఎం పవన్ నిర్వహించనున్న ఈ మార్చ్ కు సంఘీభావం ప్రకటించాయి. కానీ, మార్చ్ లో మాత్రం పాల్గొనలేమని రెండు పార్టీలకు చెందిన నేతలు పవన్ కళ్యాణ్ కు లేఖ రాశారు. కాగా,  త‌మ‌తో పొత్తుకున్న, క‌లిసి సాగిన పార్టీ ముఖ్య నేత అనారోగ్యం స‌మ‌యంలో...ప‌వ‌న్ ప‌రామ‌ర్శించ‌క‌పోగా...జ‌గ‌న్ స్వ‌యంగా ఆయ‌న ఇంటికి వెళ్లి ఆరోగ్య ప‌రిస్థితిని వాక‌బు చేయ‌డం...స‌హ‌జంగానే జ‌న‌సేనానిపై రాజ‌కీయంగా పైచేయి సాధించార‌నేందుకు నిద‌ర్శ‌న‌మ‌ని ప‌లువురు అంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: