చంద్రబాబుకు వరస షాకులు తగులుతున్నాయి. ఈ నెల 10వ తేదీన ఏపీకి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రాబోతున్నారు. ఆయన చేతుల మీదుగా కండువా కప్పుకునే టీడీపీ నేతల లిస్ట్ చాలా పెద్దదిగానే ఉంది. అందులో బలమైన నేతలు ఉన్నారు. టీదీపీకి అర్ధబలం, అంగబలం సమకూరుతూ వస్తున్న ఆ నేతలు ఠక్కున సైకిల్ దిగిపోతే టీడీపీ కష్టాలు అన్నీ  ఇన్నీ కావు.


ఇదిలా ఉండగా విశాఖ జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు బీజేపీలో చేరుతారని అంటున్నారు. గంటా వైసీపీలో చేరుతారని వినిపించిన వార్తలు ఇపుడు కొత్త మలుపు తీసుకుంటున్నాయి. వైసీపీలో చేరకుండా గంటా బీజేపీ వైపుగా సాగుతున్నారన్నది లేటెస్ట్ టాక్. వైసీపీలో చేరడం ద్వారా మంత్రి పదవి పొందవచ్చునని భావించినా దానికి లోకల్ పాలిటిక్స్ ఇబ్బందికరంగా మారడంతో గంటా బీజేపీలోకి వెళ్లాలనుకుంటున్నారుట.


మరో వైపు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్ గంటాతో చర్చలు జరిపి ఆయన్ని పార్టీ వైపుగా నడిపించారని అంటున్నారు. గంటా కూడా కొన్ని డిమాండ్లు పెట్టారని వాటిని బీజేపీ హై కమాండ్ సరేనని చెప్పిందని అంటున్నారు. దీని బట్టి చూస్తే గంటా ఈ నెల 10వ తేదీన ఏపీకి వచ్చె జేపీ నడ్డా సమక్షలో బీజేపీ తీర్ధం పుచ్చుకుంటారని తెలుస్తంది. మరి పార్టీ ఫిరాయించే వారిపై అనర్హత వేటు పడుతుందని జగన్ ఇప్పటికే అసెంబ్లీ వేదికగా సంకేతాలు ఇచ్చారు. గంటా పార్టీ మారితే టీడీపీకి రాజీనామాతో పాటు ఎమ్మెల్యే సీటుకు కూడా చేయాలి. మరి చేస్తారా లేదా అన్నది చూడాల్సివుంది. ఒకవేళ గంటా కనుక ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే విశాఖ ఉత్తరానికి ఉప ఎన్నికలు వస్తాయి. మరి ఉప ఎన్నికల్లో ఆయన బీజేపీ తరఫున పోటీ చేస్తారా లేదా అన్నది చూడాలి.




మరింత సమాచారం తెలుసుకోండి: