వైసీపీ ఇపుడు టీడీపీ బాటలోనే సాగుతోంది. నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష అంటోంది. చంద్రబాబు దాంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఏపీలో ఎన్నికలు ముగిసి ఏడు నెలలు గడచినా టీడీపీ గ్రాఫ్ పడిపోతోంది తప్ప ఎగబాకడంలేదు. మరో వైపు చంద్రబాబు జిల్లాల టూర్లు చేస్తూ నేతలకు ధైర్యం చెబుతున్నా వలసలు ఆగడంలేదు. అటు వైసీపీ, ఇటు బీజేపీలోకి పసుపు  నేతలు జంప్ చేస్తున్నారు.


ఇక ఎమ్మెల్యేల తీరు చూసినా అలాగే ఉంది. టీడీపీలో నాయకత్వ సంక్షోభం కారణంగానే ఈ పరిణామాలు సంభవిస్తున్నాయి అంటున్నారు. చంద్రబాబు వయసు మీరిపోవడం లోకేష్ కి దక్షత లేకపోవడం వల్లనే నేతలంతా పార్టీని వదిలేస్తున్నారని చెబుతున్నారు. మరో వైపు వేధింపులు,  కేసుల భయం కూడా ఉందని  కూడా చెబుతున్నారు.


ఈ నేపధ్యంలో వల్లభనేని వంశీని వైసీపీలోకి తీసుకుంటారన్న ప్రచారం ఉంది.వంశీని ఒక్కడినే తీసుకోకుండా కనీసం ఆరుగురు ఎమ్మెల్యేలను లాగాలని వైసీపీ చూస్తోందని అంటున్నారు అలా కనుక చేసినట్లైతే చంద్రబాబు ప్రతిపక్ష పదవికి ముప్పు వస్తుందని ఆయన సాధారణ సభ్యుడైపోతారని వైసీపీ వ్యూహకర్తలు అంచనా వేస్తున్నారు. ఇక వంశీ రాజీనామాను నేరుగా స్పీకర్ కి ఇవ్వకుండా స్పీకర్ ఫార్మెట్లో లేఖ రాసి మరీ దానిని బాబుకు పంపించేలా వైసీపీ సలహా ఇస్తోంది. బాబు ఆ లేఖను ఉంచుకుంటారా పంపుతారా అన్నది ఇక్కడ చూస్తారన్న మాట. ఒకవేళ బాబు ఆ లేఖను పంపితే తప్పు బాబు మీదకే  పోతుంది. ఉంచుకుంటే  ఎంతకాలం సాగితే అంతకాలం వంశీ ఎమ్మెల్యేగా ఉంటూనే వైసీపీలో కొనసాగుతారని అంటున్నారు. 


ఇలా టీడీపీ వీడి వచ్చిన ఎమ్మెల్యేల రాజీనామాలను బాబుకే పంపించి ఆయన్నే నిర్ణేతగా చేస్తే రేపటి రోజున ఏ  ఎమ్మెల్యేల  మీద  కూడా బాబు గట్టి విమర్శలు చేసే అవకాశం ఉండదని భావిస్తున్నారు. మొత్తానికి వైసీపీ ఆరుగురి ఎమ్మెల్యేల వేటలో ఉందిట. అదే కనుక జరిగితే శీతాకాల సమావేశాల నాటిని బాబుకు విపక్ష నాయకుని హోదా ఉండదని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.


మరింత సమాచారం తెలుసుకోండి: