ఇటీవల ఏపీ సర్కారు వైఎస్సార్ లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డు ఇవ్వాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇలాంటి అవార్డులు నిజజీవితంలో హీరోలకూ ఇవ్వాలని జగన్ నిర్ణయించారు. అంతేకాదు.. మొదటగా ఆ అవార్డుకు గోదావరి బోటు ప్రమాదం సమయంలో మృతదేహాలను వెలికి తీసిన ధర్మాడి సత్యంను అవార్డు విజేతగా ప్రకటించారు.


అయితే ఈ ధర్మాడి సత్యానికి అవార్డు ఇవ్వాలన్న ఆలోచన మాత్రం ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావుదని తెలుస్తోంది. ఆయన సలహాతోనే ఈ అవార్డు ప్రకటించినట్టు చెబుతున్నారు. ఎందుకంటే గురువారం ఉదయం ఒక టీవీ ఛానల్ లో తన ప్రవచనా లు వినిపిస్తూ.. గరికపాటి.. సందర్భానుసారం గా గోదావరి లో జరిగిన బోటు ప్రమాదాన్ని కూడా గరికపాటి ప్రస్తావించారట.


అజాగ్రత్త వల్ల ఎలాంటి ప్రమాదా లు జరుగుతాయి అనడానికి బోటు ప్రమాదమే ఉదాహరణ అని చెప్పిన గరికపాటి ఈ బోటు వెలికితీయటం లో అసాధారణ పని తీరు కనబరిచిన ధర్మాడి బృందాన్ని మెచ్చుకున్నారు. ప్రభుత్వా లు కూడా అవార్డు లు, స్థలాలు , ఇళ్లు ఇచ్చేటప్పుడు ఇలాంటి నిజమైన హీరోలకు ఇవ్వాలని సూచించారు. గరికపాటి చేసిన సూచనను ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి దృష్టికి కొందరు తీసుకెళ్లారట. దాంతో మంచి సలహాలు స్వీకరించిన జగన్ మోహన్ రెడ్డి వెంటనే ధర్మాడి సత్యానికి అవార్డు ఇచ్చేందుకు పచ్చజెండా ఊపారట. అదీ సంగతి.


గోదావరిలో బోటు మునిగి... ఎన్డీఆర్ ఎఫ్ ప్రయత్నించినా సాధ్యం కానిది ధర్మాడి బృందంతో సాధ్యమైంది. ఇక బోటు బయటకు రాదేమో అని అందరూ భావిస్తున్న సమయంలో సత్యం బృందం ముందుకొచ్చింది . తాము బయటకు తీస్తామని నమ్మకంగా చెప్పింది. ఎన్ని అడ్డంకులు ఎదురైనా మాట నిలబెట్టుకుంది. ఇందుకుగాను ప్రభుత్వం సత్యం బృందానికి ఇరవై రెండు లక్షల రూపాయలు అందించినట్టు తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: