ప్రస్తుతం నగరాల్లో ఉండే వారికీ ఈ కార్డు గురించి బాగా తెలుసు. ఎవరో కొంతమంది చెప్పిన మాటలు విని కొంతమంది క్రెడిట్ కార్డు వద్దు అనుకుంటారు. కానీ ఆ కార్డు వల్ల ఎన్ని ఉపయోగాలో.. ఆ కార్డుని ఎలా ఉపయోగించాలో తెలియక ఇబ్బందులు పడుతుంటారు. నిజమే కార్డు డేంజర్ కానీ ఉపయోగించడం తెలిస్తే ఈజీ. 


అయితే కొందరికి తక్కువ శాలరీ ఉన్న అప్పటికి మంచి కంపెనీ అవ్వడంతో క్రెడిట్ కార్డు ఈజీగా వస్తుంది. అయితే ఆలా క్రెడిట్ కార్డు వచ్చిన సమయంలో తక్కువ లిమిట్ తో కార్డు వస్తుంది. అయితే ఆ లిమిట్ ఎలా పెంచుకోవాలో ఇక్కడ చదివి తెలుసుకోండి. మీరు క్రెడిట్ లిమిట్ పెంచుకోవాలనుకుంటే కస్టమర్ కేర్‌కు కాల్ చెయ్యాలి. 


అనంతరం కస్టమర్ కేర్ కి కాల్ చేసి మీ వివరాలు చెప్పి క్రెడిట్ లిమిట్ ఎలా పెంచాలో తెలుసుకోవాలి. లిమిట్ పెంచడానికి అవకాశాలు ఏంటి అనేది తప్పనిసరిగా తెలుసుకోవాలి. మీ జీతం పెరిగినట్టైతే అందుకు తగ్గ ఆధారాలు చూపించి వాటితో పాటు సాలరీ స్లిప్స్, ఫామ్ 16 లాంటి డాక్యుమెంట్స్ ఇవ్వాలి. ఆలా ఇచ్చిన తర్వాత మీ క్రెడిట్ కార్డు లిమిట్ పెంచాలా ? లేదా అనేది బ్యాంకు వాళ్ళు చెప్తారు. 


అయితే క్రెడిట్ కార్డ్ వినియోగించుకున్నప్పుడు సరిగ్గా వాడుతూ, బిల్లులు సరైన సమయంలో చెల్లిస్తే బ్యాంకులే కొంతకాలం తర్వాత క్రెడిట్ లిమిట్ పెంచేందుకు ఆఫర్ ఇస్తాయి. కాల్, ఎస్ఎంఎస్, ఇమెయిల్ ద్వారా బ్యాంకులు మిమ్మల్ని సంప్రదించి మీ క్రెడిట్ లిమిట్ పెంచే అవకాశం ఉందని చెప్తారు. ఇష్టం ఉంటె ఈజీగా అప్పుడు లిమిట్ ని పెంచుకోవచ్చు. 


కాగా ఇప్పుడు ఉన్న క్రెడిట్ కార్డు లిమిట్ పెంచకపోతే మరో క్రెడిట్ కార్డు తీసుకొని లిమిట్ పెంచుకోవచ్చు. ఆలా పెంచుకున్న సమయంలో అనువల్ ఫీజు కూడా పెరుగుతుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: