అయోధ్య వివాదం ఒక కొలిక్కి వచ్చింది.  క్లైమాక్స్ కూడా ముగిసింది.  ఇప్పుడు ఫైనల్స్ ఫలితం తెలియాలి.  దేశంలో ప్రజలందరూ పరీక్షలు రాసి రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్న పిల్లల్లా ఎదురు చూస్తున్నారు.  సుప్రీం కోర్టు దగ్గర రిజల్ట్ ఉన్నాయి.  ఎన్నికల ఫలితాల కోసం కూడా రాజకీయ నాయకులు ఇంతగా ఎదురుచూసి ఉండరు.  కానీ, ఇప్పుడు ఎన్నికల ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.  


ఈనెల 15 వ తేదీ  తీర్పు వెలువడాల్సి ఉన్నది.  ఈ తీర్పు ఎలా ఉండాలి.. ఎలా ఉంటె బాగుంటుంది అనే విషయాల చుట్టూనే తిరుగుతున్నది.  తీర్పుకోసమే ప్రతి ఒక్కరు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నిన్నటి వరకు అయోధ్యలోని,దేశంలోని ఇతర రాష్ట్రాలలోను ఒక టెన్షన్ ఉండేది.  ఎలా ఉంటుందో అని.  కానీ, ఇప్పుడు ఆ టెన్షన్ లేదు.  ఇప్పుడు దేశంలో ఉన్నదల్లా భయమే.  అయోధ్యలో ఏం జరుగుతుంది.. ఎవరికి అనుకూలంగా తీర్పు వచ్చినా రెండో వర్గం ప్రజలు వ్యతిరేకం అవుతారు.  


అప్పట్లో అలహాబాద్ హైకోర్టు తీర్పు ఇచ్చినపుడు కూడా ప్రజలు పెద్దగా రియాక్ట్ కాలేదు.  కానీ, ఇప్పుడు రాబోయే తీర్పు సుప్రీం కోర్టు నుంచి వస్తున్నది కాబట్టి, ప్రజలు భయపడుతున్నారు.  ఎలాంటి వార్తలు వినాల్సి వస్తుందో అని భయానికి లోనవుతున్నారు.  ఇప్పుడు అయోధ్యలో పూర్తిస్థాయిలో బలగాలు దిగాయి.  నాలుగు అంచల భద్రతను ఏర్పాటు చేశారు.  సోషల్ మీడియాపై నిఘా పెట్టారు.  పోలీస్, ఆర్మీ పహారాలో అయోధ్య ఉన్నది అంటే సమస్య ఎలాంటిదో అర్హ్డం చేసుకోవచ్చు.  


అయోధ్య తీర్పు సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు దేశంలోని అన్ని రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని కేంద్రం హెచ్చరించింది.  రామజన్మభూమి విషయంలో వస్తున్న తీర్పు కావడంతో, ప్రతి ఒక్కరికి ఇదొక సెంటిమెంట్ గా ఉంటుంది కాబట్టి  అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది.  ముఖ్యంగా హైదరాబాద్, ముంబై, కోల్కతా, గోవా రాష్ట్రాల్లో దీని ఎఫెక్ట్ బాగా కనిపిస్తుంది.  ఆయా రాష్ట్రాల్లో భద్రతను పెంచినట్టు సమాచారం.  


మరింత సమాచారం తెలుసుకోండి: