ప్రస్తుతం నారా లోకేశ్ వివిధ జిల్లాల్లో పర్యటిస్తూ
తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. గుంటూరులో ఇసుక కొరతపై నారా లోకేశ్ కొన్నిరోజుల క్రితం దీక్ష చేశారు. పార్టీ కార్యక్రమాలలో నారా లోకేశ్ యాక్టివ్ గా పాల్గొంటూ ఉండటంతో లోకేశ్ కు చంద్రబాబు కీలక బాధ్యతలు అప్పగించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అతి త్వరలో లోకేశ్ ను చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమిస్తారని సమాచారం.
తెలుగుదేశం పార్టీ గతంలోనే నారా లోకేశ్ ను తెలుగుదేశం జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించాలని భావించినా కొన్ని కారణాల వలన ఆ ప్రయత్నాలు సఫలం కాలేదు. ప్రస్తుతం
తెలుగుదేశం పార్టీ నాయకుల్లో నారా లోకేశ్ కు జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇస్తారని ప్రచారం జరుగుతోంది. త్వరలోనే చంద్రబాబు నాయుడు నాయుడు పార్టీ సమావేశంలో అధికారికంగా లోకేశ్ పదవి గురించి ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. మరి ఈ వార్త నిజమో కాదో తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే.