ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలుగా విడిపోయిన తరువాత కొన్ని విషయాల్లో రాజకీయనేతలు మరో రాష్ట్రంలోని రాజకీయనేతలను అనుకరిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తరువాత సీఎం కేసీఆర్ తనయుడు కేటీఆర్ ను తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించారు. బీజేపీ పార్టీలో జాతీయ స్థాయిలో ప్రెసిడెంట్ గా అమిత్ షా ఉన్నారు. 
 
జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా జేపీ నడ్డా ఉన్నారు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నారా లోకేశ్ ను  తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించే ఆలోచనలో ఉన్నారట. నారా లోకేశ్ ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసిన నారా లోకేశ్ వైసీపీ అభ్యర్థి చేతిలో ఓడిపోయిన విషయం తెలిసిందే. 
 
ప్రస్తుతం నారా లోకేశ్ వివిధ జిల్లాల్లో పర్యటిస్తూ తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. గుంటూరులో ఇసుక కొరతపై నారా లోకేశ్ కొన్నిరోజుల క్రితం దీక్ష చేశారు. పార్టీ కార్యక్రమాలలో నారా లోకేశ్ యాక్టివ్ గా పాల్గొంటూ ఉండటంతో లోకేశ్ కు చంద్రబాబు కీలక బాధ్యతలు అప్పగించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అతి త్వరలో లోకేశ్ ను చంద్రబాబు తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమిస్తారని సమాచారం. 
 
తెలుగుదేశం పార్టీ గతంలోనే నారా లోకేశ్ ను తెలుగుదేశం జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించాలని భావించినా కొన్ని కారణాల వలన ఆ ప్రయత్నాలు సఫలం కాలేదు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ నాయకుల్లో నారా లోకేశ్ కు జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇస్తారని ప్రచారం జరుగుతోంది. త్వరలోనే చంద్రబాబు నాయుడు నాయుడు పార్టీ సమావేశంలో అధికారికంగా లోకేశ్ పదవి గురించి ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. మరి ఈ వార్త నిజమో కాదో తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే. 
 
 



మరింత సమాచారం తెలుసుకోండి: