మహారాష్ట్ర రాజకీయాలు ఎలా తిరగబోతున్నాయని ఇప్పుడు అందరిలో ఉత్కంఠను రేపుతున్నాయి. సీఎం కుర్చీ కోసం ఇటు శివసేన అటు బీజేపీ పట్టు వదలకపోవటంతో ప్రభుత్వం ఏర్పాటు కుదరడం లేదు.  పొత్తుతో బరిలోకి శివసేన బీజేపీ ఎన్నికల ఫలితాల తరువాత అధికార పీఠం కోసం ఒకరి పై ఒకరు విమర్శలు చేసుకోవడం తో ఈ సమస్యకి ముగింపు లేకుండా ముందుకు సాగుతుంది. శివసేనకు 56 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. బీజేపీ నుంచి 105 మంది సభ్యులుగా ఎన్నికయ్యారు. ఈ రెండు పార్టీలను కలిపితే వీరి సంఖ్య 161 అవుతుంది. అప్పుడు మొత్తం 288 సీట్లున్న అసెంబ్లీలో ఈ కూటమికి క్లియర్ మెజారిటీ వఛ్చినట్టే.. కానీ ఈ రెండు పార్టీలూ ఎవరి మంకుపట్టు వారు పడుతుండడంతో మహా లొల్లి ఎటూ తెగడంలేదు.

అయితే మహారాష్ట్ర రాజకీయం రోజుకొక మలుపు తిరుగుతుంది. కేంద్రమంత్రి బీజేపీ నేత నితిన్ గడ్కరీ.. దేవేంద్ర ఫడ్నవీస్ సీఎం అవుతారని ప్రకటిస్తే.. కొద్దిసేపటికే.. శివసేన  తమ ఎమ్మెల్యేలను ఎవరూ విడదీయలేరని సేన సీనియర్ నేత సంజయ్ రౌత్ ప్రకటించిన కాసేపటికే.. పార్టీ చీఫ్ ఉధ్ధవ్ థాక్రే నివాసం మాతోశ్రీ  కొంచెం దూరంలో ఉన్న ‘ రంగ్ శారద ‘ అనే హోటల్ కు వారిని తరలించారు. దీనితో మహారాష్ట్రలో రిసార్ట్ రాజకీయాలు మొదలైయ్యాయి.  

మరో పక్క మహారాష్ట్రలో ప్రధాన పార్టీ అయినా ఎన్సీపీ కూడా శివసేనకు మద్దతు ప్రకటించకపోవటంతో శివసేన ఇరకాటంలో పడింది. రొటేషన్ సీఎం పదవి పై వెనక్కు తగ్గరాదని ఫడ్నవీస్ మళ్ళీ సీఎం కాకుండా చూడడానికి తమ పార్టీ అన్ని యత్నాలూ చేస్తుందని ఉధ్ధవ్ ఇంట్లో సమావేశమైన ఎమ్మెల్యేలంతా ఒక నిర్ణయానికి వచ్చారని సమాచారం.  ఈ నెల 9 తో అసెంబ్లీ కాల పరిమితి ముగుస్తుంది. ఆలోగా ఇది పరిష్కారం కాక పోతే రాష్ట్రపతి పాలనే దిక్కవుతుంది. అలాగే బీజేపీ మైనారిటీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కూడా సిద్ధంగా లేదని  తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: