ఆర్టీసీ కార్మికుల చేస్తున్న లాంగ్ సమ్మెతో ఇప్పటికే కేసీఆర్ మీద ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. అయితే ఇప్పుడు కోర్టులో కేసీఆర్ కు గట్టి దెబ్బ తగిలిందని చెప్పాలి. అసలు టీఎస్ ఆర్టీసీ అనేది చట్టవిరుద్దమని కేంద్రం కోర్టుకు చెప్పడంతో కోర్ట్ కూడా అదే ప్రశ్నను తెలంగాణ ప్రభుత్వాన్ని అడిగింది. దీనితో కోర్ట్ కూడా సీరియస్ అయ్యింది. అసలు విభజన జరక్కుండానే టీఎస్ ఆర్టీసీ ని ఎలా ఏర్పాటు చేశారని కోర్ట్ నిలదీసింది. ఆర్టీసీలో తమకు 33 శాతం వాటా ఉందని కేంద్రం హైకోర్టు కు చెప్పడంతో కథ కొత్త మలుపు తిరిగింది. ఇక ఏపీఎస్ ఆర్టీసీ లో కేంద్రానికి 33 శాతం వాటా ఉందని అది టీఎస్ ఆర్టీసీకి ఆటోమెటిక్ గా బదిలీ కాబోదని కేంద్ర ప్రభుత్వం హైకోర్టు కు ఆర్టీసీ సమ్మె పై విచారణ సందర్భంగా  తెలియ జేసింది.


కేంద్రం తరుపున వాదించిన లాయర్ అసలు టీఎస్ ఆర్టీసీ ను ఏర్పాటు చేయడం చట్ట విరుద్దమని కోర్ట్ కు చెప్పారు.  ఏపీఎస్ ఆర్టీసీని విభజిస్తే తప్పని సరిగా కేంద్రం అనుమతి తీసుకోవాలని కేంద్రం అలాంటి అనుమతి ఇచ్చినట్లు ఆధారాల్లేవని ఆయన కోర్టుకు చెప్పారు.కాగా కేంద్రం కొత్తగా తెర పైకి ఈ వాదన తేవడంతో హైకోర్టు తెలంగాణ ప్రభుత్వానికి పలు ప్రశ్నలు అడిగింది. ఆర్టీసీ.. ఏపీఎస్ ఆర్టీసీగా.. టీఎస్ ఆర్టీసీగా విభజన జరిగిందా? లేక టీఎస్ ఆర్టీసీ కొత్తగా ఏర్పాటైందా? ఆర్టీసీ అంటే టీఎస్ ఆర్టీసీయేనా? లేక ఏపీఎస్ ఆర్టీసీనా? అని  ప్రశ్నించింది.


దీనితో తెలంగాణ సీఎస్ స్పందిస్తూ షెడ్యూల్ 9 కింద ఆర్టీసీ వస్తుందని .. అలాగే పునర్విభజన చట్టంలోని సెక్షన్ 3 ప్రకారం టీఎస్ ఆర్టీసీ ఏర్పాటైందని ఏజీతోపాటు ఆర్టీసీ ఇంచార్జ్ ఎండీ తెలిపారు. ఆర్టీసీ విభజన అంశం కేంద్రం దగ్గర పెండింగ్ లో ఉందని అడ్వకేట్ జనరల్ చెప్పారు. దీంతో న్యాయమూర్తి జోక్యం చేసుకుని ఒకవైపు విభజన పెండింగ్ లో ఉందని చెబుతున్నారు .. మరో వైపు కొత్త ఆర్టీసీ ని ఏర్పాటు చేశామంటున్నారు... ఇదెలా సాధ్యమని ప్రశ్నించారు. ఏపీఎస్ ఆర్టీసీ విభజన కోసం రెండు రాష్ట్రాలూ కేంద్రాన్ని అనుమతి కోరాలి కాదా అని నిలదీసింది ధర్మాసనం.  కేంద్రం అనుమతి లేకుండా రెండు కొత్త సంస్థలు ఎలా ఏర్పాటు చేస్తారని ప్రశ్నించింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: