ఒకప్పుడు ఎవరింట్లో చూసినా ల్యాండ్ మొబైల్ ఉండేది.  ఫోన్ రింగ్ అయితే ఎవరైనా సరే అక్కడికి వచ్చి మాట్లాడాల్సిందే.  ఎప్పుడైతే సెల్ ఫోన్ అందుబాటులోకి వచ్చింది.  ల్యాండ్ ఫోన్ తో కనెక్షన్ క్రమంగా తగ్గిపోయింది.  ల్యాండ్ ఫోన్ ను వాడేవాళ్లు సంఖ్య చాలా తక్కువగా ఉన్నది.  ఆఫీస్ ల్లో తప్పించి ఇంట్లో సాధారణంగా ల్యాండ్ మొబైల్ ఫోన్ వాడటం లేదు.  దీంతో బిఎస్ఎంఎల్ వంటి సంస్థలు డీలా పడ్డాయి.  


దేశంలోని ప్రతి నెట్ వర్క్ కు బిఎస్ఎన్ఎల్ ఆధారం అయినప్పటికీ.. బిఎస్ఎన్ఎల్ మాత్రం ఇంకా వెనకటి కాలంలోనే ఉండిపోయింది.  దీంతో ఆ సంస్థ తీవ్రంగా నష్టపోవాల్సి వస్తున్నది.  ఇప్పుడు ఈ సంస్థలో ఉన్న లక్షా 69 వేలమంది ఉద్యోగుల్లో 50శాతం వరకు వీఆర్ఎస్ తీసుకోబోతున్నారు.  అంటే దాదాపుగా బిఎస్ఎన్ ఎల్ లో ఉద్యోగుల సంఖ్య సగానికి తగ్గిపోతుంది.  కాగా, ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ సంస్థ ఓ అఫర్ ను ప్రకటించింది.  


ల్యాండ్ లైన్ కనెక్షన్ తీసుకొని ఐదు నిమిషాల కంటే ఎక్కువ కాల్స్ మాట్లాడితే.. ఆరు పైసల చొప్పున ఎదురు ఇస్తామని చెప్తోంది.  ఇదేదో బాగుంది కదా. అన్ని కంపెనీలు ఘటనల తరబడి మాట్లాడితే డబ్బులు వసూలు చేస్తారు.  కానీ, బిఎస్ఎన్ ఎల్ మాత్రం ఎదురు డబ్బులు ఇస్తామనడం విశేషం.  బ్రాండ్ బ్యాండ్ కనెక్షన్ తీసుకున్నాక ఉచిత బ్రాండ్ బ్యాండ్ ప్యాకేజిలో రోజుకు 5 జీబీ ఇంటర్నెట్ ను 10 ఎంబిపీఎస్ తో వినియోగించుకోవచ్చు.  


ఆ తరువాత కనీస ప్లాన్ నెలకు రూ. 349 రూపాయలతో మొదలౌతుంది.  ఈ ప్లాన్ లో రోజుకు 2జీబీ డేటాను 8 ఎంబిపీఎస్ తో వినియోగించుకోవచ్చు.  రాష్ట్రంలో ఫైబర్ కనెక్టివిటీతో పాటు ఫైబర్ బ్రాండ్ బ్యాండ్, హోమ్ వైఫై  కనెక్షన్లు అందిస్తున్నట్టు బిఎస్ఎన్ఎల్ తెలిపింది.  ఈ ప్లాన్ వర్కౌట్ అయితే.. చాలామంది తిరిగి బిఎస్ఎన్ ఎల్ కు మారిపోవడం ఖాయం అని అంటున్నారు.  మరి చూద్దాం ఏం జరుగుతుందో.  


మరింత సమాచారం తెలుసుకోండి: