ఎన్నికల సమయంలో వైఎస్ జగన్ కొన్ని హామీలు ఇచ్చాడు.  హామీలు ఇచ్చినట్టుగానే జగన్ ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తున్నారు.  ఇచ్చిన హామీల్లో కొన్నింటిని ఇప్పటికే అమలు చేశారు.  కొన్ని హామీలు అమలు జరగాల్సి ఉన్నది.  ఎన్నికల సమయంలో జగన్ మద్యపాన నిషేధాన్ని విధిస్తామని చెప్పారు. చెప్పినట్టుగా దశలవారీగా మద్యపానాన్ని నిషేదించుకుంటూ వస్తున్నారు.  అక్టోబర్ 1 వ తేదీ నుంచి ఆంధప్రదేశ్ లో ప్రైవేట్ మద్యం షాపులను బంద్ చేశారు.  


ప్రభుత్వమే అక్కడ మద్యం దుకాణాలను నిర్వహిస్తోంది.  అది ఖచ్చితమైన సమయంలో మాత్రమే మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి.  సమయం దాటితే మద్యం అమ్మారు.  ఇక ఊర్లలో ఎవరైనా సరే మద్యం అమ్మినట్టుగా తెలిస్తే.. వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధం అవుతున్నది.  దీంతో పల్లెటూరిలో మద్యం దొరికే ఛాన్స్ లేదు.  బెల్టు షాపులు తగ్గిపోవడంతో మద్యం అమ్మకాలు చాలా వరకు తగ్గిపోయాయి.  


ఈ సంఖ్యను ఇంకా తగ్గించాలని చూస్తోంది.  క్రమంగా ప్రభుత్వం నిర్వహించే మద్యం దుకాణాలను కూడా ఒక్కొక్కటిగా తీసేయాలని ప్రభుత్వం ప్లాన్.  ఇక ఇదిలా ఉంటె, రాష్ట్రంలో ఉన్న బార్ అండ్ రెస్టారెంట్ పై కూడా ప్రభుత్వం ఓ కన్నేసింది.  ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా, అసౌకర్యం కలగకుండా ఉండే ప్రాంతంలో మాత్రమే బార్లు ఉండాలి ఆదేశాలు జారీ చేశారు. 


అలానే మద్యం దుకాణాలను ఉదయం 11 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే అనుమతి ఉన్నది.  ఉదయం 11 గంటలకు ముందుగాని, రాత్రి 10 తరువాతగాని మద్యం విక్రయించకూడదు.  అలా చేస్తే కఠినమైన చర్యలు తీసుకుంటారు.  జనవరి 1 వ తేదీ నుంచి బార్లకు ఇచ్చిన ఆదేశాలు అమలు కాబోతున్నాయి.  సో, జనావాసాల మధ్య, స్కూల్స్, గుడి తదితర ప్రాంతాల్లో ఉండే బార్లకు చెక్ పడబోతున్నదన్నమాట.  


మరింత సమాచారం తెలుసుకోండి: