క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిస్ధితులు  చూస్తుంటే అదే అనుమానం  వస్తోంది. తెలుగుదేశంపార్టీకి చెందిన కొందరు ఎంఎల్ఏలు పార్టీకి రాజీనామా చేయాలని డిసైడ్ అయినట్లు సమాచారం.  టిడిపి తరపున గెలిచిన ఎంఎల్ఏల్లో కొందరు బిజెపిలో చేరటానికి రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. దాంతో వారిపై అనర్హత వేటు పడే అవకాశాలున్నాయి. అదే జరిగితే ఉపఎన్నికలు తప్పేలా లేదు.

 

ఇంతకీ విషయం ఏమిటంటే విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గం టిడిపి ఎంఎల్ఏ గంటా శ్రీనివాసరావు బిజెపిలో చేరటం దాదాపు ఖాయమని అర్ధమైపోతోంది. గడచిన మూడు రోజులుగా గాం ఢిల్లీలోనే మకాం వేశారు. టిడిపిలో నుండి బిజెపిలోకి ఫిరాయించిన సుజనాచౌదరి, సిఎం రమేష్ తో గంటలతరబడి మంతనాలు జరిపారు. దానికి క్లైమ్యాక్స్ గా జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ తో కూడా గురువారం దాదాపు మూడు గంటలు భేటి  అయ్యారు.  

 

ఈ భేటిలో ప్రధానంగా పార్టీ మారితే అనర్హత వేటు పడే అవకాశం, ఉపఎన్నికలు, బిజెపి టిక్కెట్టుపై పోటి చేసే అవకాశాలు,  గెలుపు తదితరాలపైనే ప్రధానంగా చర్చలు జరిపినట్లు సమాచారం. ఇవన్నీ కాదంటే అనర్హత వేటునుండి తప్పించుకునే అవకాశాలపైన కూడా చర్చించినట్లు తెలుస్తోంది. అంటే అనర్హత వేటు పడినా మళ్ళీ తమకే టిక్కెట్లు దక్కేట్లు హామీ తీసుకున్నట్లు అర్ధమవుతోంది.

 

మామూలుగా గంటా ఏ పార్టీలోకి మారినా ఒక్కరే మారరన్న విషయం అందరికీ తెలిసిందే. అదేపద్దతిలో ఇపుడు తాను బిజెపిలోకి చేరితే తనతో పాటు కనీసం మరో ఐదుగురు ఎంఎల్ఏలను కూడా తీసుకొస్తానని మాధవ్ కు హామీ ఇచ్చినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

 

ఎలాగూ చంద్రబాబునాయుడు నాయకత్వంపై నమ్మకం పోయిందని కొందరు ఎంఎల్ఏలు ప్రైవేటు సంభాషణల్లో చెప్పుకుంటున్నారు. అందుకే వైసిపిలో చేరటానికి రెడీ అవుతున్నారు. అయితే టిడిపి ఎంఎల్ఏలను చేర్చుకునే విషయంలో జగన్మోహన్ రెడ్డి పెద్దగా ఆసక్తి చూపటం లేదు. దాంతో పార్టీ మారాలని అనుకున్న ప్రజాప్రతినిధులకు, నేతలకు బిజెపి మాత్రమే ప్రత్యామ్నాయంగా మారింది. ఇప్పటికే గన్నవరం ఎంఎల్ఏగా వల్లభనేని వంశీ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఇపుడు గంటాతో పాటు మరికొందరు రాజీనామాలు చేస్తే చంద్రబాబుకు పెద్ద షాకే.

 


మరింత సమాచారం తెలుసుకోండి: