ఏపీ అన్న రాష్ట్రం ఏర్పాటు వెనక ఎన్నో కష్టాలు బాధాలు ఉన్నాయన్న సంగతి అందరికీ తెలిసిందే. నిజానికి ఇటు గంజాం వరకూ అటు బళ్లారి వరకూ, మరో వైపు చెన్నపట్నం వరకూ విస్తరించి ఉన్న ఆంధ్ర రాష్ట్రం    భాషాప్రయుక్త ప్రాతిపదికన విభజన నేపధ్యంలో చాలా నష్టపోయింది. చెన్నపట్నం పరిసరాలు, క్రిష్ణగిరి వంటి తెలుగు మాట్లాడే ప్రదేశాలు మద్రాస్  లోకి వెళ్లిపోయగాబళ్లారి  ప్రాంతాలు కర్నాటక‌కు బదిలీ చేశారు. ఇక గజాం పర్లాకిమిడి ప్రాంతాలు ఒడిషా వైపు కలిపారు. ఆ విధంగా అంధ్ర రాష్ట్రం భౌగోళికంగా నష్టపోయింది.


ఇక ఉమ్మడి ఏపీ అన్ని దాదాపు ఆరు దశాబ్దాల పాటు కలసి ఉన్నా ఎట్టకేలకు విడిపోక తప్పలేదు. ఈ నేపధ్యంలో 2014 జూన్ 2 నుంచి ఏపీ 13 జిల్లాలతో వేరు పడిపోయింది. పడుతూ లేస్తూ సాగుతున్న ఏపీలో ఇపుడు మరో పునర్విభజన  జరుగుతుందని అంటున్నారు. అయితే ఈసారి ఏపీకి లాభంగా మారే అవకాశం ఈ విభజనతో ఏర్పడనుంది. యానాం పట్టణాన్ని ఏపీలో కలిపేందుకు కేంద్రం గట్టి చర్యలు తీసుకుంటోందని అంటున్నారు. పాండిచ్చేరి కేంద్ర ప్రాలిత ప్రాంతంగా ఉన్న దాంట్లో .యానాం  భాగంగా వుంది. అయితే భౌగోళికంగా యానాం ఆంధ్రప్రదేశ్ లో ఉంది.  పాండిచ్చేరి తమిళనాడులో ఉంది. మరి ఈ రెండింటికీ మధ్య 700 కిలోమీటర్ల దూరం ఉంది. పరిపాలనా సౌలభ్యం కోసం చూసుకున్నా యానాం నానా ఇబ్బందులు పడాల్సివస్తోంది.


అయితే యానాం ని పాండిచ్చేరి నుంచి విడదీయడం ద్వారా అక్కడ ఎంపీ సీటుపై పట్టు సాధించాలని బీజేపీ భావిస్తోంది. యానాంలో కాంగ్రెస్ కి ఉన్న గట్టి బలం వల్ల మొత్తం ఎంపీ ఫలితంపై ప్రభావం పడుతోందంట. దాంతో బీజేపీకి రాజకీయ పరమైన ఆలోచనలు ఉన్నాయి. మరో వైపు ఏపీ సీఎం జగన్ కూడా యానాంని ఏపీలో కలపాలని కేంద్ర హోం శాఖను కోరుతున్నట్లుగా చెబుతున్నారు.
ఏపీలో మద్యపాన నిషేధం అమలవుతున్నా తూర్పుగోదావరి జిల్లాను ఆనుకుని  ఉన్న యానాం నుంచి అక్రమంగా మద్యం సరఫరా అవుతోందని, యానం విషయంలో  ఏపీ సర్కార్ ఏమీ చేయలేకపోతోదన్నది జగన్ హోంశాఖ వద్ద వెల్లబుచ్చిన ఆవేదన, అభిప్రాయం. దాంతో యానాంను తొందరలోనే ఏపీలో కలిపేందుకు కేంద్రం కసరత్తు చేస్తోందని అంటున్నారు. అదే జరిగితే 70 ఏళ్ళ ఏపీ కష్టాలు, నష్టాలకు ఒక పట్టణం తొలిసారిగా ఏపీకి అదనంగా వచ్చి చేరుతుందన్న మాట. అదే సమయంలో మద్యపాన నిషేధం కూడా ఏపీలో  సక్రమంగా అమలు అవుతుందని అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: