మధ్యతరగతి ప్రజలు ప్రభుత్వం అందించే పథకాలపై పెద్దగా ఆధారపడదు.  ప్రభుత్వం పధకాలు ఇచ్చినా ఇవ్వకున్నా పెద్దగా పట్టించుకోరు.  ఉన్నత తరగతికి చెందిన వ్యక్తులకు అసలు ఈ పధకాలు అవసరమే లేదు.  ఎవరైనా పధకాల కోసం కక్కుర్తి పడ్డారు అంటే అంతకంటే ఘోరం మరొకటి ఉండదు.  మధ్యతరగతికి దిగువున, దారిద్య్రరేఖలో ఉన్న వ్యక్తుల కోసం ప్రభుత్వం పధకాలు ప్రవేశపడుతుంది.  ఎందుకంటే వాళ్లకు రెక్కాడితేనే గాని డొక్కడుడు.  


ఓపిక ఉన్నా లేకున్నా పని పనిచేయాల్సిందే.  చేయకుంటే... కడుపు మాడ్చుకోవడమే.  అందుకే తప్పనిసరిగా పనులు చేస్తుంటారు.  అరకొర సంపాదనతో కాలం వెళ్లదీస్తుంటారు.  ఇలాంటి వాళ్ళ కోసం నిత్యావసర వస్తువులను తక్కువ ధరకు అందిస్తుంటారు.  గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వ్యక్తులు ఈ పధకాలను వినియోగించుకుంటూ ఉంటారు.  చిత్తూరులోని గుర్రంకొండలోని ఇందిరమ్మ కాలనీలో లక్ష్మీదేవి అనే మహిళ నివాసం ఉంటోంది.  ఆమె కుటుంబం పశువులపై ఆధాపరపడి జీవిస్తోంది.  రెండేళ్ల క్రితం జరిగిన పల్స్ సర్వేలో ఆమె పేరును తొలగించారు.  


ఆమె పేరును తొలగించడంతో షాక్ అయ్యింది.  అప్పటి నుంచి ఆమెకు రేషన్ ఇవ్వడం లేదు.  రేషన్ పై ఆధారపడి జీవిస్తుంటారు.  ఈ విషయంపై లక్ష్మీదేవి ఎన్నోసార్లు ఎమ్మార్వో ఆఫీస్ కు వెళ్లి తాను బతికే ఉన్నానని, రికార్డులు సరిచేయాలని కోరింది.  కానీ, ఇంతవరకు ఆ రికార్డుల్లో ఆమె వివరాలను సరిచేయలేదు.  గత రెండేళ్లుగా లక్ష్మీదేవి కళ్ళు అరిగేలా తురుగుతున్నా పనులు జరగడం లేదు.  


ఓ చిన్న తప్పును కరెక్ట్ చేయడానికి ఎందుకు ఆమెను అన్నిసార్లు తిప్పించుకుంటున్నారో అర్ధం కావడం లేదు.  తప్పు కరెక్ట్ కాకుంటే రేషన్ అందదు.  రేషన్ లేకుంటే జీవనం కుంటుపడుతుంది.  గత రెండేళ్లుగా ఇబ్బందులు పడుతూనే జీవనం సాగిస్తోంది.  ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలి అనుకున్నా ఎలానో తెలియక బాధితురాలు ఇబ్బంది పడుతున్నది.  ఉన్నతాధికారులైనా స్పందించి న్యాయం చేయాలని బాధితురాలు కోరుతోంది 


మరింత సమాచారం తెలుసుకోండి: