ఐదేళ్ళు అధికారంలో ఉండి ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ఇంతచిన్న పనికూడా చేయలేకపోయారా ? అని ఆశ్చర్యంగా ఉంది.  తాజాగా అగ్రిగోల్డ్ బాధితుల్లో రూ. 10 వేల లోపు డిపాజిట్ చేసిన వారికి జగన్మోహన్ రెడ్డి చెక్కుల పంపిణి చేశారు. జగన్ తీసుకున్న నిర్ణయం వల్ల సుమారు 3.7 లక్షల మంది డిపాజిట్ దారుల సమస్యలు పరిష్కారమైంది. ఇందుకోసం జగన్ కేటాయించిన మొత్తం కూడా ఏమంతా పెద్దదీ కాదు. కేవలం రూ. 265 కోట్ల రూపాయల కేటాయింపుతోనే అన్ని లక్షలమందిని జగన్ ఆదుకున్నారు.

 

అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకుంటానని జగన్ పాదయాత్రలో హామీ ఇచ్చారు. హామీ ఇచ్చినట్లే  సిఎం అయిన తర్వాత జరిగిన మొదటి క్యాబినెట్ సమావేశంలోనే అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకోవటానికి రూ. 1150 కోట్లు కేటాయించాని డిసైడ్ అయ్యారు. ఇందులో భాగంగానే మొదటి విడతలో 10 వేల రూపాయల్లోపు డిపాజిట్ చేసిన 3.7 లక్షలమందిని ఆదుకునేందుకు రూ. 265 కోట్లు మంజూరు చేశారు.

 

వీళ్ళ తర్వాత రూ. 20 వేలలోపు డిపాజిట్ చేసిన వారిని కూడా ఆదుకుంటామని తొందరలోనే అవసరమైన నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. మొదటివిడతలో చెప్పినట్లుగానే నిధులు మంజూరు చేశారు కాబట్టి రెండో విడతలో మరింతమంది బాధితులను జగన్ ఆదుకుంటాడని ఆశగా ఎదురుచూస్తున్నారు.

 

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే చంద్రబాబు హయాంలోనే అగ్రిగోల్డ్ సంస్ధను మూసేశారు. దాంతో డిపాజిట్ చేసిన లక్షలాదిమంది బాధితులు రోడ్డున పడ్డారు. తమను ఆదుకోవాలని బాధితులు ఎన్నిరకాలుగా వేడుకున్నా, ఆందోళనలు చేసినా చంద్రబాబు పట్టించుకోలేదు.

 

పైగా సంస్ధకు చెందిన కోట్లాదిరూపాయల ఆస్తులను దోచేసుకోవాలని ప్లాన్ వేసినట్లు ఆరోపణలు కూడా ఉన్నాయి. నిజానికి  రూ. 265 కోట్లు కేటాయించి లక్షలాది మంది బాధితులను ఆదుకోవటం పెద్ద కష్టమేమీ కాదు. బాధితులను ఆదుకోవాలని చంద్రబాబుకు మనసురాలేదంతే. ఇపుడు జగన్ చేసినట్లే అప్పట్లో చంద్రబాబు కూడా వాళ్ళని ఆదుకునుంటే కనీసం మరో నాలుగు సీట్లన్నా వచ్చేవేమో ?

 


మరింత సమాచారం తెలుసుకోండి: