ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందుకు గాను బాలల విద్యాహక్కు చట్టం ప్రకారం నాణ్యమైన ఉచిత విద్యతో పాటుగా, అన్ని సౌకర్యాలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ వార్త తెలంగాణా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లలకు శుభవార్త అని చెప్పవచ్చూ.


ఇకపోతే  2019-20 విద్యా సంవత్సరానికి మారుమూల ప్రాంతాల నుండే కాకుండా వివిధ గ్రామాల నుండి స్కూలుకు రావడానికి బస్సు సౌకర్యం లేని విద్యార్థులకు రవాణా భత్యం (టీఏ)కింద నెలకు రూ.1,52,800 చొప్పున పది నెలలకు రూ.15,28,000 మంజూరు కానున్నాయి. ఇందుకు గాను ఇప్పటికే చాలా మంది విద్యార్థులు వారి వారి బ్యాంకు అకౌంట్లు ఇవ్వగా.. ఇంకా కొందరు ఇవ్వాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ పధకం వల్ల జిల్లాలోని ఏడు మండలాల్లో ఆయా పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ప్రయోజనం కలుగనుందని అధికారులు పేర్కొంటున్నారు..


ఇక తరగతుల వారిగా ఇచ్చే ఈ టీఏలు ఎలా ఉన్నాయంటే ఒకటి నుంచి ఐదో తరగతి చదివే వారికి నెలకు రూ.400, ఆరు నుంచి ఎనిమిదో తరగతి చదివే విద్యార్థులకు రూ.600 అందించనున్నారు. ఇకపోతే జిల్లాలోని శంకర్‌పల్లి మండలంలో 106 మంది ఉండగా, అతిస్వల్పంగా మొయినాబాద్‌ మండలంలో ఏడుగురు విద్యార్థులు రవాణా భత్యం అందుకోనున్నారని తెలిపారు..


ఇకపోతే కిలోమీటర్‌పైగా ప్రాథమిక పాఠశాల, 3 కిలోమీటర్లపైగా ప్రాథమికోన్నత పాఠశాల, 5 కిలోమీటర్లపైగా ఉన్నత పాఠశాల విద్యార్థులకు బస్సు సౌకర్యం లేకుంటే, ఆయా గ్రామాల నుంచి వచ్చే విద్యార్థులకు, విద్యా హక్కు చట్టం ప్రకారం రవాణా భత్యం ఇవ్వాల్సి ఉంటుంది.


ఈ క్రమంలోనే జిల్లాలోని 7 మండలాల్లోని 27 పాఠశాలల్లో చదువుతున్న 316 మంది విద్యార్థులకు రూ.15,28,000 రవాణా భత్యం ప్రభుత్వం మంజూరు చేయనుంది. 2019-20 విద్యాసంవత్సరానికి సంబంధించిన ఈ నిధులను వేసేందుకు అర్హులైన విద్యార్దుల ఖాతాలను సేకరిస్తున్నారు. ఇదే కాకుండా 10వ తరగతి వరకు చదివే విద్యార్థినులకు, 12 ఏండ్ల బాలురకు, ఉచిత బస్‌పాస్‌ సౌకర్యం ఆర్టీసీ ద్వారా కల్పించారు.


ఇక ఈ రవాణా భత్యం కష్టపడి చదువుకోవాలనే తపనతో దూరంగా ఉన్నా మారుమూల గ్రామాల నుండి స్కూళ్లకు వచ్చే విద్యార్థులకు ఎంతగానో ఉపయోగకరంగా  నిలవనుందని అధికారులు వెల్లడిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: