మనిషికి ఆహారం లేకపోయినా ఉండగలడేమో కానీ, నీళ్లు లేకుండా ఎక్కువ రోజులు బతకలేదు. శరీరంలో 70శాతం నీటితోనే నిండిపోయి ఉంటుంది.అటువంటి నీళ్లలో బల్లులు పురుగులు పడితే.. ఇంకేమన్నా ఉన్నదా. బల్లి విష జంతువు.  బల్లి మీదపడితేనే ఒళ్ళు జలదరిస్తుంది.  అలాంటిది బల్లి పడిన నీటిని తాగితే ఇంకేమన్నా ఉన్నదా చెప్పండి.  వాంతులు అవుతాయి.. ప్రాణాలు కూడా పోవచ్చు.  ఇలాంటి సంఘటన ఒకటి హైదరాబాద్ లోని అంబర్ పేటలో చోటు చేసుకుంది.  


లక్షలు లక్షలు పెట్టి ప్రైవేట్ కాలేజీలకు పిల్లలను పంపుతుంటే.. అక్కడ పిల్లలకు ఎలాంటి నీరు ఇస్తున్నారో తెలుసా.. బల్లులు పడిన నీరు పిల్లకు ఇస్తున్నారు.  అందులో ఏమున్నాయో.. ఏం పడుతున్నాయో చూసుకోకుండా తాగేందుకు ఇవ్వడం మహానేరం.. చూసుకోకుండా జరిగిపోయింది.. దానికి కాలేజీ యాజమాన్యం బాధ్యత వహించి తగిన చర్యలు తీసుకోవాలి.  మరలా అలాంటివి జరగని హామీ ఇవ్వాలి.  


అవేమి ఇవ్వకుండా అసలు నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంటె విద్యార్థులకు కోపం రాదా చెప్పండి.  తప్పకుండ వస్తుంది.  ఇలాంటి సంఘటన ఒకటి హైదరాబాద్ లోని అంబర్ పేటలోని డిడి కాలనీలో జరిగింది.  డిడి కాలనీలో చైతన్య కాలేజీ ఉన్నది.  ఆ కాలేజీ వాటర్ ట్యాంకర్ లో బల్లి పడింది.  ఆది చూసుకోకుండా అక్కడి విద్యార్థులు తాగేశారు.  అలా ఆ నీళ్లు తగిన కాసేపటికి విధ్యార్థులకు వాంతులు అయ్యాయి.  


కొంతమంది చేతులకు దద్దుర్లు వచ్చాయి.  అస్వస్థతకు గురి కావడంతో ఆ విద్యార్థుల తల్లిదండ్రులు వచ్చి వారిని హాస్పిటల్ కు తీసుకెళ్లారు.  ఈ విషయం తెలిసిన విద్యార్థి సంఘాలు పెద్దఎత్తున అక్కడికి చేరుకున్నాయి.  అలా అక్కడికి చేరుకున్న విద్యార్థి సంఘాలను పోలీసులు నచ్చచెప్పి పంపించేశారు.  ఈ విషయంలో కాలేజీ యాజమాన్యం నిమ్మకు నీరెత్తినట్టుగా ఉండంతో విద్యార్థులు మండిపడుతున్నారు.  ఇకపైన ఇలాంటివి జరిగితే ఊరుకునేది లేదని హెచ్చరిస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: