తెలుగుదేశంలో పార్టీలో ఇప్పుడు ఉండాలి అంటేనే నేతలు ఇబ్బంది పడే పరిస్థితి ఉందా...? అంటే అవుననే సమాధానం వినపడుతుంది. రాజకీయంగా ఇబ్బంది పడుతున్న ఆ పార్టీకి ఇప్పుడు భవిష్యత్తు లేదనే వాదన కార్యకర్తల్లో కూడా వినపడుతుంది. సోషల్ మీడియాలో హడావుడి చేయడం మినహా ఇప్పుడు తెలుగుదేశం ముందు ప్రత్యామ్నాయ మార్గాలు ఏంటి అనేది స్పష్టత రావడం లేదు. ఆ పార్టీ అధినేత చంద్రబాబు పర్యటనలు వరుసగా చేస్తూ ఇసుకను రామ జపం చేస్తూ ప్రభుత్వాన్ని విమర్శించే కార్యక్రమం చేస్తున్నారు.


నేతల చెవుల్లో రక్త౦ వచ్చే పరిస్థితి ఉందనేది సోషల్ మీడియాలో ఆ పార్టీ కార్యకర్తలు అనడం విడ్డూరం. కేంద్రంతో ఇప్పుడు చంద్రబాబు సయోధ్య కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకోసం తన పరిచయాలను కూడా వాడుకునే కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టారు. ఇప్పుడు అవి అంతగా ఫలించే అవకాశం కనపడటం లేదు. మరో వైపు నమ్మిన నేతలు వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. ఈ నేపధ్యంలో బలమైన నేతలుగా ఉన్న వారు జారుకునే ప్రయత్నం చేస్తున్నారు.


ఈ పరిణామాల నేపధ్యంలో పార్టీ ఏ విధంగా నిలబడుతుంది అనేది ప్రశ్నార్ధకంగా మారింది. ఇక పర్యటనలకు వస్తున్న చంద్రబాబు పదే పదే ప్రభుత్వాన్ని విమర్శించడానికి ఇసుకను ఎంచుకోవడంతో కార్యకర్తలు కూడా వినలేకపోతున్నారు. పార్టీ కోసం పని చేసిన కార్యకర్తల్లో చాలా మంది ఇప్పుడు పార్టీకి దూరంగా ఉంటున్నారు. దీనికి ప్రధాన కారణం పార్టీకి భవిష్యత్తు కనపడకపోవడం, చంద్రబాబు ప్రసంగాలకు ఆదరణ లేకపోవడం, ఆయన రాజకీయానికి కాలం చెల్లడం.


అటు కేంద్రం కూడా ఇప్పటికిప్పుడు ఇబ్బంది పెట్టకపోయినా త్వరలోనే ఆ రోజులు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. దీంతో కూడా కార్య‌క‌ర్త‌లు రిస్క్ చేసేందుకు ఇష్ట‌ప‌డ‌డం లేదు. దీనితో కార్యకర్తలు ఇప్పుడు హడావుడి చేసి ఇబ్బంది పడటం ఎందుకు అనే భావనలో ఉన్నారట.



మరింత సమాచారం తెలుసుకోండి: