ఈ కాలంలో ఎవరిని నమ్మకూడదు. కళ్లు మూసి తెరిచేలోపు మోసాలు చేసి పారిపోతారు... మరికొందరు బెదిరించి వారి పని చేయించుకుంటారు. ఇంకా విషయానికి వస్తే ఓ మోసగాడు షార్ట్‌ ఫిల్మ్స్, సినిమాల్లో అవకాశం ఇప్పిస్తానంటూ మైనర్‌ బాలికలు, యువతులకు ఎరవేస్తాడు. అనంతరం వారికీ డబ్బు ఆశ కలిపించి లైంగికంగా అనుభవిస్తాడు. అది అంత రహస్య కెమెరాల్లో చిత్రీకరించి.. అవి చూపి వారిని బలవంతంగా వ్యభిచార కుప్పంలోకి దించుతున్నాడు. 


ఆ వ్యక్తి గుట్టను నెల్లూరు పోలీసులు బయట పెట్టారు. పోలీసులకు సమాచారం అందడంతో ఒకే సమయంలో ప్రధాన నిందితుడిని, ఎనిమిది మంది నిర్వాహకులను, ఐదుగురు విటులను అరెస్ట్ చేశారు. కాగా అదే సమయంలో ఏడుగురు బాధిత యువతులకు విముక్తి కల్పించారు. నెల్లూరులో నిన్న మీడియాతో మాట్లాడిన పోలీసులు జరిగిన విషయాలను వెల్లడించాడు. 


నెల్లూరుకు చెందిన ఓ బాలిక షార్ట్ ఫిల్మ్స్, సినిమాలలో అవకాశాలు కలిపిస్తా అని అమ్మాయిలను వ్యభిచార కుప్పంలోకి లాగుతున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో జిల్లా ఎస్పీ ఐశ్వర్యరస్తోగి ఆదేశాలతో టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ ఐ.శ్రీనివాసన్, నగర పోలీసు అధికారులతో ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దీంతో ఒకొక్కరుగా ప్రధాన నిందితుడు వరుకు అందరూ బయటకు వచ్చారు. 


ఈ వ్యభిచార గృహాలు 4 సంవత్సరాలుగా సాగుతుంది అని, ఈ విషయాలు అన్ని బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు అని పోలీసులు తెలిపారు. కాగా ఈ వ్యవహారంలో కొందరు మీడియా ప్రతినిధులు కూడా ఉన్నారని పోలీసులు తెలిపారు. అయితే నిందితుల నుంచి ఓ కారు, ల్యాప్‌టాప్, మోటార్‌బైక్, 14 సెల్‌ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు. కాగా ప్రధాన నిందితుడిని అరెస్ట్‌ చేసేందుకు కృషిచేసిన టాస్క్ ఫోర్స్ టీమ్ ని డీఎస్పీ అభినందించి వారికీ రివార్డులను ప్రకటించారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: