ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము లో గ్రామాపంచాయతీలకు గత మూడు నెలలక్రితమే ముగిసిన ఎన్నికలు నిర్వహించడం లేదని ఒకరు కోర్టులో పిటీషన్ వేసారు. అందులో కాలపరిమితి ముగిసినా ఎన్నికలు నిర్వహించకుండా గ్రామాల్లో  ప్రత్యేక అధికారులతో పాలన సాగిస్తున్నారని,  వీలైన తొందరగా ఎన్నికలు నిర్వహించేలా ఆదేశాలు జారీచేయాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఈ విషయం పైన విచారణ జరిపిన ధర్మాసనం పంచాయతీ ఎన్నికల నిర్వహణలో ఆలస్యం ఎందుకు జరిగింది అని  రాష్ట్ర ప్రభుత్వాన్ని  ప్రశ్నించి వివరణ ఇవ్వాలని గడువు విధించింది.

ప్రభుత్వం తరుపున న్యాయవాది పంచాయతీ వార్డు సభ్యులు, సర్పంచి సీట్ల విషయంలో రిజర్వేషన్లను ఎన్నికల కమిషన్ జారీచేస్తే  ఎన్నికలు నిర్వహించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలియజేశారు. వారు జారీ  చేయకపోవడంతో ఎన్నికలు నిర్వహించలేదని ఆయన స్పష్టం చేశారు  అలాగే ముందుగా మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని ప్రయత్నాలు చేశామని దానికి అనుకూలంగా ఏర్పాట్లు చేస్తున్నామని ఇంతలో ఏ విషయాన్నీ గురించి మీ దాకా వచ్చింది అని వివరించాడు.

కోర్టు  ప్రభుత్వాన్ని మూడు నెలల్లో ఎన్నికలు నిర్వహించాలని గత సంవత్సరం లోనే  హైకోర్టు తీర్పు ఇచ్చినా ఇంత వరకూ నిర్వహించకపోవడం ఏంటని నిలదీసింది. దీనికి బదులిస్తూ ప్రభుత్వతరుపు న్యాయవాది పంచాయతీల గడువు  ముగిశాక గ్రామా కార్యదర్శులు ప్రత్యేక అధికారులుగా కొనసాగవచ్చని తెలిపారు. మూడు నెలల్లో మున్సిపల్‌ ఎన్నికలు ముగిశాక గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు.

ఈ వాదనలు విన్న ధర్మాసనం సాధారణంగా పంచాయతీల గడువు ముగియకుండానే ఎన్నికలు నిర్వహించాలని గుర్తుచేస్తూ వీలైనంత తొందరగా పంచాయతి ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది. అలాగే, రిజర్వేషన్ల ఖరారులో రాష్ట్ర ప్రభుత్వం జాప్యం చేస్తున్నప్పుడు హైకోర్టును ఎందుకు ఆశ్రయించలేదని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను ధర్మాసనం ప్రశ్నించింది. ఎన్నికల గడువు ముగిసి 15 నెలలు గడుస్తున్నా ఎన్నికల నిర్వహించకపోవడాన్ని తప్పుపట్టింది.


మరింత సమాచారం తెలుసుకోండి: