పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో ఒక ఊహించని సంఘటన చోటుచేసుకుంది. పన్ను నొప్పి విపరీతంగా రావడంతో డెంటిస్ట్ వద్దకి వెళ్లిన ఓ మహిళ మరణించింది. వివరాల్లోకి వెళ్తే.... కామవరపుకోట మండలం అంకాలంపాడుకు గ్రామ నివాసి అయినా నిజవరకు సావిత్రి(55) గత కొన్ని రోజులుగా పంటి నొప్పితో బాధపడుతుంది. అయితే గురువారం రోజు ఆమె పంటి నొప్పి తీవ్రంగా పెరగడంతో పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో ని సూర్య దంత హాస్పిటల్ కి తన కుటుంబ సభ్యులతో సహా వెళ్ళింది. 


వైద్య పరీక్షల నిమిత్తం ఆమె కు ఒక పన్ను బాగా పుచ్చిపోయిందని.. వెంటనే తొలగించాలని ఓ డెంటిస్ట్ చెప్పాడు. దానితో సావిత్రి పన్ను పీకించుకోవడానికి సిద్ధమైంది. అపుడు డెంటిస్ట్ ఆమెకి అనస్తీషియాను(మత్తు మందు) ఇచ్చాడు. అలా మత్తు మందు ను ఇచ్చి ఇవ్వగానే ఆమె ఒక్కసారిగా కింద పడిపోయింది. ఇది గమనించిన ఆమె కుటుంబ సభ్యులు సావిత్రి పరిస్థితిని తెలుసుకోవడానికి సమీపంలోని వేరే డాక్టర్ ని తీసుకొచ్చారు. ఆ వైద్యుడు ఆమె గుండెపోటు వచ్చి మరణించిందని తేల్చాడు.


దీంతో ఆగ్రహికులైన సావిత్రి కుటుంబ సభ్యులు డెంటిస్ట్ నిర్లక్ష్యంతోనే ఆమె చనిపోయిందని ఆరోపిస్తూ సూర్య దంత హాస్పిటల్ ముందు ఆందోళనలకు దిగారు. కానీ ఆ దంత వైద్యుడు మాత్రం ఆమె మరణం లో తన నిర్లక్ష్యం ఏ మాత్రం లేదని.. మత్తు మందు ఇస్తున్న టైంలో ఆమె బాగా ఆందోళనకి గురై ఆ పైన గుండె పోటు రావడం తో సావిత్రి మరణించిందని చెప్పారు. దీనికి సంబంధించిన ఎటువంటి కేసు నమోదు కాలేదని జంగారెడ్డి పోలీస్ తెలిపారు. కేవలం పంటి నొప్పి తో బాధపడుతున్న సావిత్రి ఇలా ఊహించని రీతితో మరణించడంతో మృతురాలి బంధువులు కన్నీరు మున్నీరవుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: