ఒక సామాన్యుని జీవితం ఈ రోజుల్లో ఎలా ఉందంటే రోజంతా కష్టపడితే గాని పొద్దు గడవదు. నెల వచ్చిందంటే కనీసం ఇంటి ఖర్చులకు సరిపడా డబ్బులు కూడా సంపాదించలేని పరిస్దితులు తలెత్తుతున్నాయి. ఎందుకంటే సామాన్యుడు కడుపునిండా తినలేని విధంగా రాష్ట్రంలో అన్ని సరకుల ధరలు భగ్గుమంటున్నాయి. నెలవచ్చిందంటే చాలు పాల బిల్లని, ఇంటి అద్దె అని, కరెంట్, ఫోన్, టీవి రీచార్జ్, పిల్లల ఫీజులు ఇవే కాకుండా శరీరానికి వచ్చే వ్యాధులు, కల్తీ అవుతున్న పదార్దాలను తినగా మరింతగా ముదురుతున్న రోగాలు ఇవన్ని సామాన్య మానవుని జీవితాన్ని శాసిస్తున్నాయి.


ఇదే కాకుండా ఈ మధ్యకాలంలో మొదలైన ఆర్టీసీ సమ్మెకారణంగా ప్రతి సామాన్యునిపై అధిక భారం పడుతుంది. ఇకపోతే మధ్యతరగతి ఆర్టీసీ కార్మికుల బాధలు వారికంటి పాపలకే తెలుసన్నట్లుగా బ్రతుకుతున్నారు. ఇప్పటికే కొందరు కార్మికులు ప్రాణ త్యాగాలు చేసుకోగా, మరికొందరు బాధతో హఠాత్తుగా మరణించారు. ఇలాంటి కుటుంబాలకు దిక్కు ఎవరు. కుటుంబానికి పెద్ద దిక్కు ఐన వ్యక్తి మరణిస్తే వారుపడే మానసిక క్షోభ ఎంతగా ఊరడించిన సరిపోదు. ఒక ప్రాణాన్ని డబ్బులతో కొనగలమా? ఇకపోతే ఈ సమ్మె ప్రభావంతో ఓ ఆర్టీసీ కండక్టర్ పిచ్చివాడయ్యాడు. దాని వల్ల అతని కుటుంబం పడే వేదనకు వారు ఎవరిని నిందించాలో అర్ధంకాక భగవంతుని మీద భారం వేసి బ్రతుకుతున్నారు.


ఈ సందర్భంగా ఆ కండక్టర్ భార్య మాట్లాడుతూ, ఆర్టీసీ సమ్మె ముగియకుంటే మా జీవితాలు ముగిసినట్లే. నా భర్త ఉద్యోగానికి వెళ్తేనే కుటుంబం గడిచే పరిస్థితి. సీఎం సారూ.. కనికరిస్తే బాగుండు. సమ్మె కారణంగా ఆందోళనతో నా భర్త మతి స్థిమితితం కోల్పోయాడు. కడుపునిండా తిని 20 రోజులయ్యింది’ అంటూ కన్నీటి పర్యాంతమవుతూ తమ కష్టాలను వెల్లడించింది. ఇంతగా మనసును కలచివేస్తున్న సంఘటన జరుగుతుంది. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌ లో. ఇకపోతే  నారాయణఖేడ్‌ డిపోలో పనిచేస్తున్న కండక్టర్‌ నాగేశ్వర్‌ తన భార్య సుజాతతో కలిసి సంగారెడ్డిలో అద్దె ఇంట్లో ఉంటూ జీవనం సాగిస్తున్నాడు.


ఈ మధ్యలో ప్రభుత్వం కార్మికులు విధుల్లో చేరాలని నిర్ణయించిన డెడ్‌లైన్‌ను టీవీలో చూసినప్పటి నుంచి ఆయన ప్రవర్తనలో మార్పు వచ్చింది. అదేమంటే మూడు, నాలుగు రోజులనుంచి నాగేశ్వర్‌ టికెట్‌.. టికెట్‌.. బస్‌ ఆగింది దిగండి.. రైట్‌ రైట్‌ అంటూ అరవడం, అసందర్భంగా నవ్వుతుండటం, ఫోన్‌ రాకున్నా హాలో.. హాలో అనడం, ఎవరు చేశారని ఎవరైనా అడిగితే అశ్వత్థామ.. అని సమాధానం ఇవ్వడం. ఒక్కోసారి ఉండండి.. డిపోలో కలెక్షన్‌ కట్టివస్తా అంటూ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడని, ఇంతే కాకుండా తనను, పిల్లలను కూడా గుర్తు పట్టడం లేదని భార్య సుజాత ఆందోళన వ్యక్తం చేస్తుంది.


ఈ సమ్మె వల్ల తమ  కొడుకుల చదువులు కూడా మధ్యలోనే ఆగిపోయాయని తెలిపింది. ఇకపోతే ఈ పరిస్దితుల్లో చేతిలో డబ్బులు లేవని, తన భర్తకు చికిత్స అందించేందుకు దాతలు సాయం చేయాలని సుజాత వేడుకుంటోంది. ఆర్టీసీ ఆస్పత్రికి వెళ్తే సమ్మెలో ఉన్నవారికి చికిత్స చేయమంటూ వెళ్లగొట్టారని తెలిపింది. కాగా, నాగేశ్వర్‌కు చికిత్స చేయించేందుకు ఆర్టీసీ ఉన్నతాధికారులు చొరవ తీసుకోవాలని కార్మికులు, స్థానికులు ఈ సందర్భంగా కోరుతున్నారు..సమ్మె ఎందుకోసం చేస్తున్నరనే విషయాన్ని పక్కన పెడితే ఇలాంటి మధ్యతరగతి కుటుంబాలు ఎన్నో ఇలాగే భాధపడుతున్నాయనే విషయం ప్రభుత్వ అధికారులకు ఎప్పుడు తెలుస్తుందో అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: