జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయం ఏమో గాని ఆ పార్టీ నేతల్లో మాత్రం ఇప్పుడు భవిష్యత్తు అంధకారం కనపడుతుంది. పార్టీని అసలు ఎందుకు పెట్టాడు మా జీవితాలను ఎందుకు పణంగా పెట్టాడు అంటూ కార్యకర్తలు, నాయకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. నాలుగేళ్ల పాటు చంద్రబాబుని పొగిడి, శాలువాలు కప్పించుకుని, ఏడాది పాటు చంద్రబాబుని తిట్టి గడ్డం పెంచుకుని ప్రచారం చేసి, ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు జపం చేస్తున్నారు. దీనితో ఇప్పుడు కార్యకర్తల్లో నేతల్లో అసహనం వ్యక్తం చేస్తున్నారు.


ఇటీవల లాంగ్ మార్చ్ అనగానే భారీగా గోదావరి జిల్లాలు, ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి కార్యకర్తలు అభిమానులు వైజాగ్ వెళ్ళారు. అంతా అనుకున్నట్టు గానే కార్యక్రమం ఒక మోస్తారుగా విజయం సాధించింది. ఇక్కడే పవన్ వేసిన ఒక అడుగు నీరసం తెప్పించింది. లాంగ్ మార్చ్ కి తెలుగుదేశం నేతలను పిలిచి, వారి ప్రసంగాలకు ప్రాధాన్యత ఇచ్చారు. ఇక వారు కూడా తమ నియోజకవర్గాల నుంచి నిరసనకు జనాలను తరలించే కార్యక్రమం చేసారు. దీనితో ఇప్పుడు నేతలు అసలు పవన్ ఏ నిర్ణయం తీసుకుంటాడు అంటూ అర్ధం కాక గడ్డం గోక్కునే పరిస్థితి ఏర్పడింది.


రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గాల్లో ఉన్న నేతలు ఇప్పుడు తమ భవిష్యత్తు అర్ధం కాక ఇబ్బంది పడుతున్నారు. ఆస్తులు అమ్మి పార్టీ కోసం వారు భారీగానే ఖర్చు చేశారని సమాచారం. ఇప్పుడు మళ్ళీ పవన్, చంద్రబాబుతో కలవడంతో వారు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఆ భవిష్యత్తు లేని పార్టీతో నీ అడుగులు ఏంటి అని... నీకంటే సినిమాలు చేసుకునే అవకాశం ఉందని తమ భవిష్యత్తు ఏంటి అని అసహనం వ్యక్తం చేస్తున్నారు. మిమ్మల్ని నమ్మి రాజకీయాల్లోకి వస్తే మా రాజకీయ జీవితాన్ని ఈ విధంగా చేయడం ఎంత వరకు సబబు అంటూ దండం పెట్టేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: