తెలంగాణ రాష్ట్రంలో అబ్దుల్లాపూర్ మెట్  తహసిల్దార్ విజయారెడ్డి హత్య కలకలం రేపిన విషయం తెలిసిందే. అందరూ ఉండగానే మిట్టమధ్యాహ్నం తాసిల్దార్ ఆఫీస్ లోకి వెళ్లి సురేష్ అనే నిందితుడు తహసీల్దార్ విజయారెడ్డి పై పెట్రోల్ పోసి సజీవ దహనం చేయడంతో  రెవెన్యూ ఉద్యోగ సంఘాలన్నీ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి z. అయితే తహసిల్దార్ విజయ రెడ్డి హత్య నేపథ్యంలో  తెలంగాణ రెవెన్యూ జేఏసీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ ఉద్యోగుల నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు.ఈ క్రమంలోనే రెవెన్యూ ఉద్యోగులు కలెక్టరేట్ ముందు రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. 



తాజాగా మేడ్చల్  సంగారెడ్డి జిల్లాల్లో  కలెక్టర్ కార్యాలయం వద్ద జరుగుతున్న దీక్షా శిబిరాలను సందర్శించిన తెలంగాణ రెవెన్యూ జేఏసీ  పలు విషయాలను వెల్లడించింది. తహసిల్దార్ విజయారెడ్డి పై  పెట్రోల్ పోసి సజీవ దహనం చేయడం రెవెన్యూ ఉద్యోగులు అందరినీ భయబ్రాంతులకు గురి చేసిందని తెలంగాణ రెవిన్యూ  జేఏసీ తెలిపింది. రాష్ట్రంలోని రెవెన్యూ ఉద్యోగులు అందరిలో ఆత్మస్థైర్యం నింపేందుకు భవిష్యత్తులో ఇంకెప్పుడు  ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసేందుకు తెలంగాణ రెవిన్యూ జేఏసీ ఆధ్వర్యంలో హైదరాబాద్లో సోమవారం రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించనున్నట్లు తెలంగాణ రెవిన్యూ జెఎసి పిలుపునిచ్చింది. కాగా  ఈ సమావేశంలో ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లు సంఘాలు ఉద్యోగ సంఘాల నాయకులు పాల్గొననున్నట్లు తెలిపింది . 



 ఇదిలా ఉండగా ప్రభుత్వం తీసుకొచ్చిన లోపభూయిష్టమైన చట్టాలు సాఫ్ట్వేర్ కారణంగా తాము ప్రజలకు శత్రువులుగా  మారుతున్నామని  రెవెన్యూ ఉద్యోగుల జేఏసీ  ఆవేదన వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా ఓ పత్రికా ప్రకటన విడుదల  చేసింది తెలంగాణ రెవిన్యూ ఉద్యోగుల జేఏసీ . చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా రెవెన్యూ శాఖ ఉద్యోగులను అన్ని రకాలుగా బదనాం  చేస్తున్నారు. రెవిన్యూ శాఖ ఏర్పాటు అయినప్పటి నుండి ఎప్పుడు  ఇలాంటి ఘటనలు  చూడలేదు. ప్రభుత్వాలు ఎన్ని మారిన పాలకులు ఎవరున్నా రెవిన్యూ శాఖ మొత్తం పెద్దన్నగా పాత్ర పోషించేది. రాష్ట్ర ప్రభుత్వం అంటే మొత్తంగా రెవెన్యూ అధికారులు రెవిన్యూ శాఖ అన్నట్టుగానే  ఉండేది. కానీ ప్రస్తుత ప్రభుత్వం తీసుకొచ్చిన లోపభూయిష్టమైన చట్టాలు సాఫ్ట్వేర్ కారణంగా నేడు ఆ పరిస్థితి లేకుండా పోయింది. ప్రతి సంవత్సరం రైతులతో జమాబంది నిరసిస్తూ వారి నుంచి భూమిశిస్తు వసూలు చేసి  ప్రభుత్వ ఖజానాకు  కావాల్సిన ఆదాయాన్ని  రెవెన్యూశాఖ అందించేది. అంతేకాకుండా ఏ రైతుకు ఎంత భూమి ఉందో చెప్పడం సహా వివిధ కార్యక్రమాలు చేపట్టింది. ఈ క్రమంలో రెవిన్యూ ఉద్యోగులకు రైతులకు ఒకప్పుడు విడదీయరాని అనుబంధం ఉండేదని కానీ నేడు కొత్త చట్టాలు ఆధునీకరణ కారణంగా   రైతులకు రెవెన్యూ ఉద్యోగులు శత్రువులుగా మారి పోతున్నారు  అంటూ ఆర్టీసీ జేఏసీ లేఖలో తెలిపారు. 



 కొత్తగా వచ్చిన చట్టాలు సాఫ్ట్వేర్ కారణంగా రెవెన్యూ ఉద్యోగులకు రెవెన్యూ రికార్డులను సరి  చేసే అధికారం లేదని... కొన్నింటిని మాత్రమే సరిచేసేందుకు రెవెన్యూ ఉద్యోగులు అవకాశం ఉన్నప్పటికీ ఆన్లైన్లో అది కూడా అవకాశం లేకుండా పోయిందని తెలిపింది . దీంతో క్షేత్రస్థాయిలో భూ సమస్యలన్నీ పరిష్కారం కాకపోవడంతో రైతుల వద్ద రెవెన్యూ ఉద్యోగులు అందరూ బదనాం  అవుతున్నారని... అందుకే భూపరిపాలన నుంచి రెవెన్యూ శాఖకు మినహాయింపు ఇవ్వాలని కోరుకుంటున్నామంటూ తెలంగాణ రెవిన్యూ జేఏసీ  సంయుక్త ప్రకటన విడుదల చేసింది .


మరింత సమాచారం తెలుసుకోండి: