రాష్ట్రంలో కొద్ది రోజులుగా పత్రుడు, దత్తపుత్రుడు పై బాగా ప్రచారం జరుగుతోంది.  పై పదాలపై వైసిపి, జనసేన నేతల మధ్య అయితే పెద్ద వాగ్వాదమే జరుగుతోంది. దత్తపత్రుడు అంటే వైసిపి లెక్కల ప్రకారం జనసేన అధినేత పవన్ కల్యాణ్ అనే అర్ధం.  అదే సమయంలో పుత్రుడంటే ఎలాగూ నారా లోకేష్ అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

 

ఇక్కడ గమనించాల్సిందేమిటంటే పుత్రుడు లోకేష్ అయినా, దత్తపుత్రుడు పవన్ అయినా ఇద్దరిలోను తేడా ఏమీ లేదని. ఎలాగంటే లోకేష్ అయినా పవన్ అయినా ఏమి మాట్లాడుతారో వాళ్ళకే అర్ధంకాదు కాబట్టి.  ఏదో మాట్లాడేయాలన్న ఆరాటమే తప్ప తాము మాట్లాడేదానికి అర్ధముందా ? అని ఇద్దరూ చూసుకోరు.

 

మొన్నటి ఎన్నికల్లో మంగళగిరిలో పోటి చేసిన లోకేష్ ఓడిపోయారు. అలాగే  గాజువాక, భీమవరం నియోజకవర్గాల్లో పోటి చేసిన పవన్ కూడా ఓడిపోయారు. అంటే ఇక్కడ తేలిందేమిటంటే ఒక నియోజకవర్గంలో పోటి చేసి ఓడిన పుత్రుడుకన్నా రెండు నియోజకవర్గాల్లో పోటి చేసి ఓడిపోయిన దత్తపుత్రుడే ఎక్కువని. అందుకనే చంద్రబాబునాయుడు కూడా దత్తపుత్రుడికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారేమో ?

 

ఇద్దరు కూడా సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటారు. అందులోను ట్విట్టర్లో అయితే మరీను. ట్వి’ట్టర్-ఆడిట్’ అసే సంస్ధ జాతీయస్ధాయిలో ఓ సర్వే నిర్వహించిందట. ట్విట్టర్ లో  ఫేక్ అకౌంట్లు   నిర్వహిస్తున్న నేతల వివరాలను బయటకు తీస్తే అందులో కూడా దత్తపుత్రుడే ముందున్నాడట. పవన్ పాలోవర్స్ పేరుతో ఏకంగా 54 శాతం ఫేక్ అకౌంట్లున్నట్లు తేలిందట.

 

అలాగే  లోకేష్ ఫాలోవర్స్ పేరున కూడా 50 శాతం ఫేక్ అకౌంట్లేనని తేలిపోయింది.  అదే విధంగా రాష్ట్రంలోని రాజకీయ నేతల ఫాలోవర్స్ పేర్లతో ఉన్న ఫేక్ ఖాతాల్లో అందరికన్నా తక్కువ ఉన్నది జగన్మోహన్ రెడ్డికేనట. అంటే జగన్ కన్నా చంద్రబాబుకే ఫేక్ ఫాలోవర్లు ఎక్కువున్నారట. కాబట్టి  ఈ విషయంలో చంద్రబాబు సంతోషించాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: