
మహారాష్ట్రకు ఎన్నికలు ముగిసి చాలారోజులైంది. గత 15 రోజులుగా మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాలేదు. ప్రభుత్వం ఏర్పాటు కోసం అన్ని పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నా.. సెట్ కావడం లేదు. ఎన్డీఏ కూటమిలో ఉన్న బీజేపీ శివసేన పార్టీలు మహా ముఖ్యమంత్రి పీఠం కోసం కుమ్ములాడుకుంటున్నాయి. చేరు సగం పంచుకోవాలని అంటోంది. దానికి బీజేపీ ససేమిరా అంటోంది. ఎందుకంటే బీజేపీకి 105 సీట్లు వస్తే.. శివసేనకు 53 సీట్లు మాత్రమే గెలుచుకుంది.
కానీ, ఈ సమయంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే తప్పనిసరిగా శివసేన సపోర్ట్ చేయాలి. శివసేన సపోర్ట్ చేయాలి అంటే తనకు ముఖ్యమంత్రి పీఠం ఇవ్వాల్సిందే అని శివసేన పట్టుబడుతున్నది. కానీ, దానికి బీజేపీ అసలు ఒప్పుకోవడం లేదు. డిప్యూటీ, 13 మంత్రి పదవులు అనన ఒప్పుకోవడం లేదు. నేటితో అక్కడ ప్రభుత్వం గడువు ముగుస్తుంది. అయితే, ప్రభుత్వం ఏర్పాటు మరికొంత సమయం ఇచ్చేందుకు గవర్నర్ భగత్ సింగ్ అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే.
ఇచ్చిన సమయంలోపు ప్రభుత్వం ఏర్పాటు కాకుంటే పరిస్థితి ఏంటి.. రాష్ట్రపతి పాలన విధించాల్సి వస్తుంది. అదే జరిగితే.. మరో ఆరు నెలల్లోగా ఎన్నికలు జరుగుతాయి. మరలా ఎన్నికలు జరిగితే.. ప్రజలు బీజేపీకి పట్టంగట్టే అవకాశం ఉండొచ్చు. ఎందుకంటే సుస్థిరమైన పాలనా కాగలంటే సంకీర్ణ ప్రభుత్వాలు ఉండకూడదని, సింగిల్ పార్టీనే ఉండాలని బీజేపీ వాదిస్తూ వస్తోంది.
సంకీర్ణాలకు అవకాశం ఇస్తే ఇలానే ఉంటుంది. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కొంత సమయం ఉన్నది కాబట్టి ఈలోపు జరగాల్సిన బేరసారాలు అన్ని జరిగిపోతుంటాయి అనడంలో సందేహం అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ నుంచి కొంతమందిని బీజేపీ తమవైపు తిప్పుకోవడానికి ఇప్పటికే బేరాలు కుదుర్చుకుంటుందని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. తమ పార్టీ నుంచి కొంతమంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నట్టు ఆ పార్టీ చెప్తున్నది.
కామెంట్స్‌లో ద్వేషపూరిత వ్యాఖ్యలు చేయొద్దు. ఇతరుల పరువుకు నష్టం వాటిల్లేలా గానీ, వ్యక్తిగత దాడి, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దు. ఏ వర్గాన్ని కించపరచేలా కామెంట్స్ ఉండరాదు. ఈ మార్గదర్శకాలకు కట్టుబడి ఉండని కామెంట్లను అభ్యంతరకరమైనవిగా గుర్తించండి వాటిని తీసివేసేందుకు మాకు సహకరించండి- ఇండియాహెరాల్డ్ గ్రూప్