కేసియార్ క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని నిలుపుదల చేస్తు హై కోర్టు షాక్ ఇచ్చింది.   ఆర్టీసీ ప్రైవేటీకరించాలని  కేసీయార్ నేతృత్వంలోని క్యాబినెట్ సమావేశం తీర్మానించింది. సంస్ధ బస్సులు తిరుగుతన్న రూట్లలో ప్రస్తుతానికి 5100 రూట్లను ప్రైవేటీకరిస్తు తీసుకున్న నిర్ణయం అమల్లోకి రాకుండా సోమవారం వరకూ కోర్టు నిలిపేసింది.

 

తెలంగాణాలో కేసియార్ క్యాబినెట్ తీసుకున్న నిర్ణయం అమల్లోకి రాకుండా కోర్టు అడ్డుకోవటం బహుశా ఇదే మొదలు. అసలు టిఎస్ఆర్టీసీ ఏర్పాటే చట్టవిరుద్ధమని కేంద్రం హై కోర్టులో ఓ అఫిడవిట్ దాఖలు చేసింది. రాష్ట్ర విభజన తర్వాత ఆర్టీసీ విభజన ఇంకా కాలేదని కేంద్రం కోర్టుకు చెప్పింది. అంటే తెలంగాణాలో ఇప్పటికీ తిరుగుతున్నది ఏపిఎస్ఆర్టీసీ మాత్రమే అని కూడా స్పష్టం చేసింది.

 

ఆర్టీసీ అప్పులు, ఆస్తులను విభజించకుండానే సాంకేతిక సమస్యలను పరిష్కరించుకోకుండానే కేసియార్ టిఎస్ఆర్టీసిని ఎలా ఏర్పాటు చేస్తారంటూ కేంద్రం తెలంగాణా ప్రభుత్వాన్ని నిలదీసింది. దానికి తెలంగాణా రవాణాశాఖ, ఆర్టీసీ ఎండి సమాధానం చెప్పలేకపోయారు. దాంతో ఆర్టీసీ విషయంలో క్యాబినెట్ తీసుకున్న నిర్ణయం అమల్లోకి రాకుండా  సోమవారం వరకూ నిలిపేసింది.

 

తాను చాలా తెలివైనవాడిననని భావించే కేసియార్ కు ఇంతచిన్న విషయం కూడా అర్ధం కాలేదంటే ఆశ్చర్యంగా ఉంది. ఆర్టీసీపై తనకు గుత్తాధిపత్యం ఉందని భావిస్తున్న సిఎం విభజన జరగనందున ఏపి ప్రభుత్వానికి కూడా హక్కులున్నాయన్న విషయాన్ని ఎలా మరచిపోయారో అర్ధం కావటం లేదు. పైగా తాను తీసుకున్న ప్రతి నిర్ణయానికి కేంద్రం అనుమతి అవసరమని కేసియార్ మరచిపోయారా ?

 

క్షేత్రస్ధాయిలో జరిగిన విషయాలను గమనిస్తే అన్నీ తెలిసే కేసియార్ అడ్డదిడ్డమైన నిర్ణయాలు తీసుకున్నారని అర్ధమవుతోంది. తన అధికారాలను కోర్టు ప్రశ్నించేసరికి కావాలనే ఇష్టమొచ్చినట్లుగా, కన్ఫ్యూజ్ చేస్తు లెక్కలను ఒక్కోసారి ఒక్కో విధంగా అందిస్తున్నారు. ఆ విషయాన్ని కోర్టు కూడా గ్రహించింది. అందుకనే ప్రధాన కార్యదర్శి, రవాణాశాఖ కార్యదర్శి, ఆర్టీసీ ఇన్చార్జి ఎండిలు క్షమాపణ చెప్పుకోవాల్సొచ్చింది. మరి సోమవారం కోర్టు ఎలా స్పందిస్తుందో చూడాల్సిందే.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: